కూతురు ప్రేమ పెళ్లి.. ఆ తండ్రి ఏం చేశాడో తెలుసా?
ఇటీవల కాలంలో ఏకంగా ఇంట్లో నుంచి పారిపోయి ఇక ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకుంటున్న వారి సంఖ్య పెరిగిపోతుంది. అదే సమయంలో అటు ఏకంగా తమకు ఇష్టం లేని పెళ్లి చేసుకున్న పిల్లల విషయంలో కని పెంచిన తల్లిదండ్రుల కర్కశంగా ప్రవర్తిస్తున్న ఘటనలు కూడా ప్రతి ఒక్కరిని అవ్వక్కయ్యేలా చేస్తున్నాయి. నేటి ఆధునిక సమాజంలో కూడా పరువు హత్యలు జరుగుతూ ఉన్నాయి అని చెప్పాలి. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది. కూతురు తమకు ఇష్టం లేని ప్రేమ వివాహం చేసుకుందన్న మనస్తాపంతో ఆమె బ్రతికుండగానే శ్రద్ధాంజలి ఘటించాడు తండ్రి.
ఏకంగా కూతురి చనిపోయింది అంటూ శ్రద్ధాంజలి ఘటిస్తూ పోస్టర్లు ఏర్పాటు చేయడంతో పాటు సోషల్ మీడియాలో పోస్టులు కూడా పెట్టాడు. ఈ ఘటన మహబూబ్నగర్ జిల్లాలోని గద్వాల్ లో వెలుగు చూసింది. డాక్టర్ సోమేశ్వరి పెద్దలను ఎదిరించి కానిస్టేబుల్ రాజశేఖర్ ని పెళ్లి చేసుకుంది. అనంతరం ప్రాణహాని ఉందంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలోనే మనస్థాపంతో యువతి తండ్రి ఇలా శ్రద్ధాంజలి పోస్టర్లను ఏర్పాటు చేశారు. అయితే పోలీసులు ఆ యువతీ తల్లిదండ్రులను పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చినట్లు తెలుస్తుంది. ఈ ఘటన స్థానికంగా హాట్ టాపిక్ గా మారిపోయింది.