కృత్రిమ గర్భంతో బిడ్డకు జన్మనిచ్చిన మహిళ.. కానీ డిఎన్ఏ టెస్ట్ చేస్తే?

praveen
ఇటీవల కాలంలో వైద్యరంగంలో ఎంతో అధునాతనమైన టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది. ఇక ఇలాంటి టెక్నాలజీ ప్రతి సమస్యకు ఒక పరిష్కారాన్ని చూపిస్తుంది అని చెప్పాలి. అదే సమయంలో కొన్ని కొన్ని సార్లు టెక్నాలజీని ఉపయోగించుకుని వైద్యులు చేస్తున్న పొరపాట్లు ఎంతో మందికి చేదు అనుభవాన్ని మిగులుస్తున్నాయ్. ఇక్కడ భార్యాభర్తలకు ఇలాంటి పరిస్థితి ఎదురైంది అని చెప్పాలి. కృతిమ గర్భం ద్వారా ఆమె బిడ్డకు జన్మనిచ్చింది మహిళ. కానీ ఆ తర్వాత డిఎన్ఏ టెస్ట్ చేసి చూస్తే ఆ మహిళ షాక్ అయింది. ఎందుకంటే వైద్యులు భర్త వీర్యానికి బదులు మరొకరి వీర్యాన్ని ఉపయోగించినట్లు తేలింది.


 ఈ క్రమంలోనే తమకు జరిగిన అన్యాయానికి ఆ దంపతులు న్యాయపోరాటం చేపట్టారు. దీంతో ఇక ఆసుపత్రి.. బాధితులకు దాదాపు కోటిన్న పరిహారం చెల్లించుకుంది అని చెప్పాలి. ఈ ఘటన దేశ రాజధాని ఢిల్లీలోకి వచ్చింది. బాధిత జంట అసిస్టెంట్ రిప్రొడక్టివ్ టెక్నిక్ తో సంతాన భాగ్యం పొందేందుకు నిర్ణయించుకుంది. ఈ క్రమంలోనే ఒక ప్రైవేట్ ఆసుపత్రిని ఆశ్రయించారు. అయితే ఫలితంగా వారికి 2009లో కవలలు జన్మనిచ్చారు.ఇక్కడ వరకు అంతా బాగానే ఉంది. కానీ అసలు నిజం ఇటీవలే బయటపడింది. పుట్టిన ఇద్దరు పిల్లలకు డిఎన్ఏ పరీక్షలు చేయగా తండ్రి ఆ మహిళ భర్త కాదు మరొకరు అన్న విషయం తేలింది.



 అంటే భర్త వీర్యానికి బదులు మరొకరి వీర్యంతో వైద్యులు కృత్రిమ గర్భం దాల్చే ప్రక్రియలో ఉపయోగించారు  అన్న విషయం బయటపడింది.  దీంతో దంపతులిద్దరూ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. తమకు సదరు ఆసుపత్రి రెండు కోట్ల పరిహారం చెల్లించాలని జాతీయ వినియోగదారుల పరిష్కార కమిషన్ లో ఫిర్యాదు చేయగా.. ఇక సుదీర్ఘ విచారణ అనంతరం ఈ కేసులో దంపతులు ఇద్దరికీ అనుకూలంగా కోరుతూ తీర్పునిచ్చింది.  ఆసుపత్రి యాజమాన్యం వారికిఒకటే పాయింట్.15  కోట్లు చెల్లించాలి అంటూ వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ ఆదేశాలు జారీ చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: