పక్కకు జరుగమన్నందుకు.. తల్వార్ తో దాడి.. చివరికి?
చిన్నచిన్న కారణాలకే మనుషులు ప్రవర్తిస్తున్న తీరు చూస్తే ఇక మనుషుల్లో మానవత్వం అనేది పూర్తిగా కనుమరుగయ్యింది అనే భావన ప్రతి ఒక్కరిలో కలుగుతుంది. ఇక ఇక్కడ వెలుగులోకి వచ్చిన ఘటన గురించి తెలిస్తే మాత్రం ప్రతి ఒక్కరూ కూడా ముక్కున వేలేసుకుంటారు అని చెప్పాలి. సాధారణంగా మనం ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు దారికి ఎవరైనా అడ్డంగా ఉంటే కాస్త పక్కకు జరగండి అని చెబుతూ ఉంటాం. అయితే ఇలా పక్కకు జరగండి అని చెప్పడమే ఆ యువకుడి పాలిట శాపంగా మారిపోయింది. ఎందుకంటే పక్కకు జరుగు అని చెప్పినందుకు యువకుడు పలువురి పై తల్వార్ తో దాడి చేసిన ఘటన హైదరాబాద్ నగరంలోని అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.
సయ్యద్ అబ్దుల్ మోహిత్ ఒక చిరు వ్యాపారి. అయితే ఇటీవలే అతను సమీపంలోని ఏటీఎంకు వెళ్లి తిరిగి వస్తున్నాడు. అయితే దారికి అడ్డంగా ఉన్న మన ప్రీత్ సింగ్ ను పక్కకు జరగమని చెప్పాడు. అయితే అప్పటికే మద్య మత్తులో ఉన్న మాన్ ప్రీత్ సింగ్ ఇక తన వద్ద ఉన్న తల్వార్ తో అతనిపై విచక్షణ రహితంగా దాడి చేశాడు. అయితే సయ్యద్ అప్రమత్తం కావడంతో అతని కంటికి తీవ్ర గాయం అయింది. అయితే అతనికి సర్ది చెప్పేందుకు వచ్చినా మోన్ సైని, అఖిల్ పై కూడా మాన్ ప్రీత్ దాడి చేయడంతో తీవ్రంగా గాయపడ్డారు. కాగా స్థానికులు బాధితులను ఆసుపత్రికి తరలించగా.. ఇక ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. మన్ ప్రీత్ సింగ్ ని అదుపులోకి తీసుకున్నారు.