ముహూర్తం సమయానికి వధువు పరార్.. పెళ్లి మాత్రం ఆగలేదు?

praveen
సరిగ్గా పెళ్లి ముహూర్తం సమయానికి పెళ్లి ఇష్టం లేదు అంటూ ఒక ఉత్తరం రాసి వరుడు లేదా వధువు ఇంటి నుంచి పారిపోవడం లాంటి ఘటనలు మొన్నటి వరకు కేవలం సినిమాల్లో మాత్రమే చూసేవాల్లం. అయితే ఇటీవల కాలంలో సినిమాలను చూసి బాగా ప్రభావితం అవుతున్నారో లేదా యాదృచ్ఛికంగా ఈ ఘటనలు జరుగుతున్నాయో తెలియదు. కానీ ఇక ఇలాంటి ఘటనలు తరచూ వెలుగులోకి వస్తున్నాయి. పెళ్లి నిశ్చయించేటప్పుడు సైలెంట్ గా ఉండే వధూవరుడు.. పెళ్లిముహూర్తం సమయంలో మాత్రం ఇంటి నుంచి జంప్ అవుతూ ఉన్నారు. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది.


 సినిమాల్లో లాగానే సరిగ్గా ముహూర్తం సమయానికి పెళ్లికూతురు ఇంటి నుంచి పారిపోయింది. కానీ పెళ్లి మాత్రం ఆగలేదు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని బాంధలో వెలుగులోకి వచ్చింది. ముహూర్తం సమయానికి వధువు తన ప్రియుడితో పరార్ అయింది. ఈ విషయం తెలియగానే వధువు తండ్రి తో పాటు పెళ్లికి హాజరైన వారందరూ కూడా ఒకసారిగా షాక్ లో మునిగిపోయారు. ఆ తర్వాత షాక్ నుంచి చేరుకున్న తండ్రి చేసిన పని అందరిని మరింత ఆశ్చర్యపరిచింది. ఏకంగా పెద్దకూతురు పారిపోయినందుకు బాధ్యత వహిస్తూ.. చిన్న కూతురిని అదే వరుడికి ఇచ్చి వివాహం చేశాడు.


 అంతేకాదు తన పెద్ద కూతురిని ఇక తీసుకువెళ్లిన యువకుడి పై కూడా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఘటన కాస్త సంచలనంగా మారిపోయింది అని చెప్పాలి. అయితే ఇక ఇలా పెద్ద కూతురు పారిపోయిన సమయంలో చిన్న కుమార్తెను.. అదే యువకుడికి ఇచ్చి పెళ్లి చేయడానికి ముందుగా చిన్న కుమార్తె అభిప్రాయాన్ని అడిగాడు తండ్రి. అయితే తన తండ్రి గౌరవాన్ని నిలబెట్టేందుకు చిన్న కుమార్తె కూడా పెళ్లికి అంగీకరించింది. అయితే ఇక మరో యువతితో వివాహానికి అటు వరుడు తరుపు కుటుంబ సభ్యులు కూడా సమ్మతించడంతో వివాహ వేడుక యధావిధిగా జరిగిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: