విధి ఆడిన వింత నాటకం.. జాబ్ వచ్చిందని స్వీట్లు పంచాడు.. కానీ?

praveen
ఇటీవల కాలంలో వెలుగులోకి వస్తున్న ఘటనలు చూసిన తర్వాత మనిషి ప్రాణం ఎప్పుడూ ఎలా పోతుంది అన్నది ఊహకంగానే మారిపోయింది అన్న విషయం తెలిసిందే. ఎందుకంటే ఒకప్పుడు తల్లి కడుపులో నుంచి బయటికి వచ్చిన తర్వాత వృద్ధాప్యం వస్తేనో  లేదంటే ఒక భయంకరమైన ఆరోగ్య సమస్య వస్తేనో అర్థంతరంగా ప్రాణాలు పోతాయి అని అందరూ అనుకునేవారు. కానీ ఇప్పుడు వెలుగులోకి వచ్చిన ఘటనలు చూసిన తర్వాత వృద్ధాప్యం రావాల్సిన అవసరం లేదు. భయంకరమైన ఆరోగ్య సమస్యలు లేకపోయినా సరే.. ఇక ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయ్. అప్పుడు వరకు ఎంతో సంతోషంగా గడిగిన వారు క్షణాల వ్యవధిలో  ప్రాణాలు కోల్పోతున్నారు.

 చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరు కూడా ఇలా సడన్ హార్ట్ ఎటాక్ల కారణంగా ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు రోజురోజుకు ఎక్కువైపోతున్నాయి అని చెప్పాలి. అయితే ఇలాంటి తరహా ఘటనలకు సంబంధించిన వీడియోలు అట సోషల్ మీడియాలో కూడా చాలానే ప్రత్యక్షమవుతున్నాయ్. ఈ క్రమంలోనే ఈ వీడియోలను చూసిన తర్వాత ప్రతి ఒక్కరికి కూడా అటు ప్రాణాలపై మరింత తీపి పెరిగిపోతోంది అని చెప్పాలి. అంతే కాదు సడన్ హార్ట్ ఎటాక్ల కారణంగా ఇక ఎన్నో కుటుంబాల్లో తీరని విషాదం కూడా నిండిపోతూ ఉంది. ఇక ఇక్కడ వెలుగులోకి వచ్చిన ఘటన అయితే మరింత విచారకరమైనది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.

 సాధారణంగా ప్రతి ఒక్కరు కూడా బాగా చదువుకున్న తర్వాత మంచి ఉద్యోగం వస్తే ఇంకా అంతకంటే ఇంకేం వద్దు అని భావిస్తూ ఉంటారు. అయితే ఇక్కడ ఒక యువకుడు కూడా ఇలాగే అనుకున్నాడు. బీటెక్ పూర్తి చేసి ఉద్యోగం కోసం వెతికాడు. మంచి ఉద్యోగం కూడా వచ్చింది. కానీ అంతలోనే ఊహించని ఘటన జరిగింది. సడెన్ హార్ట్ ఎటాక్ కారణంగా అతని ప్రాణం పోయింది. ఈ విషాదకరమైన కామారెడ్డి జిల్లా సూరాయిపల్లి జగదాంబ తండాలో చోటుచేసుకుంది. బీటెక్ విద్యార్థి ప్రశాంత్ గుండెపోటుతో మృతి చెందాడు. ఉద్యోగం వచ్చిందని నిన్న స్వీట్లు పంచిన ప్రశాంత్ ఇక ఇటీవల నిద్రలోనే హార్ట్ ఎటాక్ తో చనిపోయాడు. దీంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: