ఇలా చేస్తే.. వ్యభిచారం కూడా నేరం కాదట?

Chakravarthi Kalyan
ఒక్కోసారి కోర్టులో కొత్త కొత్త చట్టాలు వెలుగులోకి వస్తుంటాయి. ఆ చట్టాలు, ఆ తీర్పులు కొన్ని కొన్ని విచిత్రంగా, వింతగా ఉంటుంటాయి. అయితే ఎన్నో లెక్కలు వేసి, ఎన్నో ఆలోచించి కోర్టులు ఆ తీర్పును ఇస్తూ ఉంటాయి. కానీ చాలాసార్లు ఆ తీర్పులు, చట్టాలు సాధారణ జనం కూడా ఆశ్చర్యపోయేలా, నోరేళ్లపెట్టేలా ఉంటాయి. ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే గతంలో రోడ్లపై నిల్చుని వ్యభిచార కార్యకలాపాలు చేసే వాళ్ళపై న్యూసెన్స్ కేసు పెట్టేవారు, వ్యభిచార కేసు పెట్టేవారు.

అలాగే ఇదివరకు ఆలయానికి వెళ్లే దారిలో కూడా ఇలాంటి వ్యభిచార గృహాలు ఉండేవి. అయితే వాళ్లపై కూడా ఇలా వ్యభిచార కేసులు అవి పెట్టినప్పుడు వాళ్ళు ఇబ్బంది పడేవారు, సిగ్గుపడేవారు. తర్వాత ఈ వ్యభిచారంపై సీటా ఆక్ట్ అనేది తీసుకువచ్చారు. ఆ తర్వాత పీటా ఆక్ట్ అని దాన్ని మార్చుకు వచ్చారు. అంటే ప్రైవేట్ ఇమ్మోరల్ ట్రాఫికింగ్ యాక్ట్ అని మార్చుకు వచ్చారు. ఈ పీటా ఆక్ట్ కింద ఆర్గనైజర్స్  వాళ్ళ ఆస్తులను కూడా స్వాధీనం చేసుకోవచ్చు అన్నాక వ్యభిచారం అనేది కొంత కంట్రోల్ లోకి వచ్చినట్లుగా తెలుస్తుంది.

అయితే ఇటీవల ముంబై కోర్టు ఇచ్చినటువంటి ఒక తీర్పు వల్ల వ్యభిచార గృహాలు నడిపే వాళ్ళకి ఇక ఇబ్బంది ఉండదని తెలుస్తుంది. వివరాల్లోకి వెళితే వ్యభిచారం నేరం కాదు, కానీ పబ్లిక్ ప్లేస్ లో చేస్తేనే అది నేరం అవుతుంది అని తీర్పు ఇచ్చింది అక్కడి కోర్టు. ముంబైలో ఒక వ్యభిచార గృహంపై దాడి చేసి ఒక 34 ఏళ్ళ మహిళను అరెస్టు చేశారు.

ఆవిడని కోర్టులో హాజరు పరిస్తే ఒక ఏడాది పాటు సంరక్షణ కేంద్రం ఆధీనంలో ఉండాలని కోర్టు తీర్పునిచ్చింది. దాంతో ఆవిడ సెషన్స్ కోర్టును ఆశ్రయించింది. దాంతో ఆ మహిళ కేసుపై విచారణ చేపట్టిన సెషన్స్ కోర్టు సంరక్షణ కేంద్రం నుండి ఆమెకు విముక్తి కల్పించాలని  ఆదేశించడం ఇప్పుడు సంచలనాన్ని కలిగిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: