
చార్జింగ్ పెట్టి ఫోన్ మాట్లాడాడు.. చివరికి?
పడుకున్నా లేచిన.. బయటికి వెళ్లిన.. ఇంట్లోనే ఉన్నా.. చివరికి బాత్రూం కి వెళ్ళినా కూడా అరచేతిలో మొబైల్ ఉండాల్సిందే. లేదంటే ఏదో కోల్పోయాం అనే బాధలో మునిగిపోతున్నారు చాలామంది జనాలు. అయితే ఇలా మొబైల్ అతిగా వాడటం కారణంగా ఎంతో మంది ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్న ఘటనలు కూడా వెలుగులోకి వస్తున్నాయి. కొంతమంది ఏకంగా మొబైల్ కి ఛార్జింగ్ పెట్టి మరి ఫోన్ మాట్లాడటం చేస్తూ ఉన్నారు. ఇక చివరికి కరెంట్ షాక్ కొట్టి ప్రాణాలు కోల్పోతున్నారు.
ఏపీలోని అనకాపల్లి జిల్లాలో కూడా ఇలాంటి విషాదకర ఘటన వెలుగులోకి వచ్చింది. ఫోన్ చార్జింగ్ పెట్టి మాట్లాడుతుండగా షాక్ కొట్టి యువకుడు మరణించాడు. 25 ఏళ్ల లక్ష్మణ్ అనే యువకుడు ఇంట్లో ఫోన్ చార్జింగ్ పెట్టి కాల్ మాట్లాడాడు. ఒకసారిగా షాక్ కొట్టడంతో కుప్ప కూలిపోయాడు లక్ష్మణ్. అయితే కుటుంబ సభ్యులు వెంటనే అతని ఆసుపత్రికి తరలించారు. అయితే పరిశీలించిన వైద్యులు అతను అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. దీంతో కుటుంబ సభ్యులందరూ కూడా కన్నీరు మున్నీరుగా విలపించారు అని చెప్పాలి. ఈ ఘటన కాస్త స్థానికంగా సంచలనంగా మారిపోయింది కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారఈ ఘటన కాస్త స్థానికంగా సంచలనంగా మారిపోయింది కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.