విచిత్రమైన దొంగతనం.. కేవలం కుడికాలి బూట్లు ఎత్తుకెళ్లిన దొంగలు?
కానీ కొంతమంది మాత్రం వెరైటీ దొంగతనాలు చేస్తూ వార్తల్లో హాట్ టాపిక్ గా మారిపోతూ ఉంటారు. ఆ దొంగలు చేసే వెరైటీ దొంగతనాలు ప్రతి ఒక్కరిని కూడా అవాక్కయ్యేలా చేస్తూ ఉంటాయని చెప్పాలి. ఇక ఇప్పుడు ఇలాంటి వెరైటీ దొంగతనానికి సంబంధించిన న్యూస్ ఒకటి తెగ వైరల్ గా మారిపోయింది. చెప్పుల దుకాణంలోకి చొరబడిన గుర్తు తెలియని వ్యక్తులు.. భారీగా షూస్ ని దొంగతనం చేశారు. వాళ్లకి షూస్ అవసరం ఉన్నాయేమో.. అందుకే దొంగతనం చేశారు అందులో కొత్త ఏముంది అని అనుకుంటున్నారు కదా. అయితే ఇక్కడ దొంగలు చోరీ చేసింది కేవలంకుడి కాలి షూస్ మాత్రమే కావడం గమనార్హం. పెరు దేశంలో ఈ విచిత్రమైన చోరీ ఘటన వెలుగులోకి వచ్చింది.
ఏకంగా చెప్పుల దుకాణంలోకి చొరబడిన వ్యక్తులు డిస్ ప్లే లో ఉంచిన బూట్లను ఎత్తుకెళ్లారు. ఈ క్రమంలోనే 200 బూట్లు చోరీకి గురైనట్లు యజమాని గుర్తించాడు. అయితే ఎత్తుకెళ్లినవన్నీ కూడా కుడి కాలి బూట్లే కావడం గమనార్హం. ఇక వాటి విలువ దాదాపు 10 లక్షల పైగానే ఉంటుందని ఇక షాప్ యజమాని చెబుతున్నాడు. అయితే ఈ చోరీ తతంగం అంతా అక్కడ సిసి టీవీ ఫుటేజీలో రికార్డు అయింది. ముగ్గురు నిందితులు అర్ధరాత్రి వేళ ఇలా చెప్పుల దుకాణం తాళం పగలగొట్టి లోపలికి ప్రవేశించి చోరీ చేసినట్లు ఆ వీడియోలో చూస్తే అర్థమవుతుంది. అయితే సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు వేలిముద్రలు సీసీటీవీ ఫుటేజీ వంటి ఆధారాలను సేకరించామని వాటి ఆధారంగా నిందితులను గుర్తిస్తాం అంటూ తెలిపారు.అయితే కేవలం కుడి కాలి బూట్లను మాత్రమే ఎత్తుకెళ్లడం కాస్త చర్చనీయాంశంగా మారిపోయింది.