అన్నదమ్ముల మధ్య గొడవ.. ఆపేందుకు వెళ్లిన బావ.. చివరికి?
అయ్యో పాపం బావమరుదులు గొడవ పడుతున్నారే.. వారికి ఏదో ఒకటి సార్ది చెబుదాం అని మధ్యలోకి వెళ్లిన బావ చివరికి బావ మరదులు చేతిలో ప్రాణాలు కోల్పోయాడు. ఈ దారుణ ఘటన జగిత్యాల జిల్లాలో వెలుగులోకి వచ్చింది. విజయపుర కాలనీ చెందిన హయత్, తాజ్ అనే ఇద్దరు అన్నదమ్ములు తల్లి వజీర్ బి కి వచ్చే పింఛన్ డబ్బుల కోసం గొడవ పడ్డారు. అయితే బావమరుదులు ఇద్దరు గొడవపడటం చూసిన వారి భావ నయీమ్ వాళ్లకు సర్ది చెప్పి గొడవను ఆపేందుకు మధ్యలోకి వెళ్లాడు. అయితే గొడవ పెద్దదై ఇక అన్నదమ్ములు ఇద్దరు కూడా బహబాహికి దిగడంతో పెనుగులాట జరిగింది.
గొడవను ఆపేందుకు మధ్యలో వెళ్లిన బావ నయీమ్ ఒకసారిగా కింద పడిపోయాడు. అయితే ఇక అక్కడ పునాది కూడా కోసం తీసిన రాయి అతని తలకు బలంగా తగలడంతో ఇక తలకు తీవ్రమైన గాయం అయింది. దీంతో తీవ్ర రక్తస్రావం అయ్యి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. అయితే నయీమ్ చనిపోయి ఉండడాన్ని చూసిన కుటుంబ సభ్యులు ఇక వెంటనే ఆసుపత్రికి తరలించారు. కానీ ఉపయోగం లేకుండా పోయింది. అప్పటికే చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. దీంతో కుటుంబ సభ్యులు బోరునా విలపించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.