ప్రియురాలని కెనడా నుంచి రప్పించాడు.. చివరికి పొలంలోకి తీసుకెళ్లి?
వివరాల్లోకి వెళ్తే.. 23 ఏళ్ల నీలం అనే యువతి ఐఈఎల్టిఎస్ పరీక్షల్లో ఉత్తీర్ణురాలు అయింది. అనంతరం ఉద్యోగం కోసం కెనడాకు వెళ్ళింది సదరు యువతి. అయితే నీలం భారత్లో ఉన్న సమయంలోనే సునీల్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కొన్నాళ్ళకే ప్రేమగా కూడా మారిపోయింది. అయితే నీలంను పెళ్లి చేసుకుంటాను అని సునీల్ హామీ ఇచ్చాడు. ఈ క్రమంలోనే తనకోసం ఇండియాకు రావాలి అంటూ నీలంను కోరాడు. దీంతో ఇక ప్రియుడిని పెళ్లి చేసుకుని జీవితాంతం సంతోషంగా ఉండాలని ఆశపడిన యువతి.. ప్రియుడి కోరిక మేరకు ఇండియా వచ్చింది.
అయితే సదరు యువతి ఇలా ఇండియాకు వచ్చిందో లేదో కనిపించకుండా పోయింది. మరోవైపు సునీల్ కూడా కొన్నాళ్లపాటు స్థానికంగా కనిపించలేదు. దీంతో నీలం కుటుంబ సభ్యులకు అనుమానం వచ్చి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. అయితే కేసులో ఎలాంటి పురోగతి కనిపించకపోవడంతో ఇక నీలం కుటుంబ సభ్యులు హర్యానా హోం మంత్రిని ఆశ్రయించారు. దీంతో కేసును భవానిలోని క్రైమ్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి బదిలీ చేయగా.. అధికారులు రంగంలోకి దిగి సునీల్ అరెస్ట్ చేశారు. చివరికి నీలంను కిడ్నాప్ చేసి దారుణంగా హత్య చేసినట్లు సునీల్ అంగీకరించాడు. మృతదేహాన్ని పొలంలో పాతి పెట్టినట్లు ఒప్పుకున్నాడు. అక్కడికి వెళ్లి చూడగా నీలం అస్తిపంజరం దొరికింది అని చెప్పాలి.