ఓయో రూమ్ బుక్ చేసి.. లవర్ ని పిలిచాడు.. కానీ కట్ చేస్తే?

praveen
అనైతిక సంబంధాల కారణంగా ఎన్నో కాపురాలు కూలిపోతున్నాయి. అంతేకాదు ఇక ఎన్నో జీవితాలు అర్ధాంతరంగానే ముగిసిపోతున్నాయి. అర్థంపర్థం లేని సంబంధాలతో ఏకంగా మానవ బంధాలకు కూడా విలువ లేకుండా పోతుంది అని చెప్పాలి. కేవలం క్షణకాల సుఖం కోసం మనిషి ఆరాటం మానవ విలువలను పూర్తిగా చంపేస్తుంది.  ఇలాంటి బంధాల కారణంగానే ఎన్నో కుటుంబాలు విచ్చినం అవుతూ ఉండడం కూడా చూస్తూ ఉన్నాం. అయితే ఇంత జరుగుతున్నా అటు మనుషుల తీరిలో మాత్రం మార్పు రావడం లేదు అని చెప్పాలి.

 అక్రమ సంబంధాల మాయలో పడిపోయి కొంతమంది ఏకంగా సొంత వారి ప్రాణాలను తీసేస్తూ ఉంటే.. ఇక ఇంకొంతమంది ఏకంగా సుఖం ఇస్తారు అన్న వారి చేతిలోనే దారుణంగా హత్యలకు గురవుతున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి అని చెప్పాలి. ఇక్కడ ఇలాంటిదే జరిగింది. ఏకంగా మహిళ అక్రమ సంబంధం కారణంగా ప్రాణాలు పోగొట్టుకునే పరిస్థితిని తెచ్చుకుంది. అంతే కాదు ఇద్దరు పిల్లలని అనాధలను చేసింది. ఈ ఘటన నోయిడాలో వెలుగులోకి వచ్చింది. ఆ మహిళకు అప్పటికే పెళ్లయి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. కానీ ఆమె చెడు దోవలో నడిచింది. ఆమెకు సోను అనే ఓ బంధువుతో పరిచయం ఏర్పడింది. పరిచయం అక్రమ సంబంధానికి దారి తీసింది.

 ఇటీవలే ఓయో హోటల్లో కలుద్దాం అంటూ సోను మహిళను ఆహ్వానించాడు. ఈ క్రమంలోనే ఒక రూమ్ కూడా బుక్ చేశాడు. అయితే గదిలోకి వెళ్లిన తర్వాత ఏం జరిగిందో ఇద్దరి మధ్య మాత్రం వాగ్వాదం మొదలైంది. సోను కి వేరే అమ్మాయితో పెళ్లయింది. దీంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. దీంతో  కోపంతో ఊగిపోయిన సోను విచక్షణ కోల్పోయాడు. దారుణంగా మహిళపై దాడి చేశాడు. ఇక దెబ్బలను తారలేకపోయిన మహిళా చివరికి ప్రాణాలు  వదిలింది. సమాచారం అందిన వెంటనే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఇక మృతదేహాన్ని పోస్టుమార్టం ఆసుపత్రికి తరలించారు.  కేసు నమోదు చేసుకుని నిందితుని అరెస్టు చేశారు. అయితే మహిళ మరణంతో ఇద్దరు పిల్లలు తల్లులేని వారుగా  మారిపోయారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: