ఇన్సూరెన్స్ చేయించి మరి.. తండ్రిని చంపేసిన కొడుకు.. చివరికి?

praveen
ఇన్సూరెన్స్ ప్రతి ఒక్కరి జీవితానికి ఒక సెక్యూరిటీని కలిగిస్తుంది అని అందరూ అంటూ ఉంటారు. ఇక మనం లేకపోయినా కుటుంబానికి మనం ఉన్నారనే భరోసాని ఇన్సూరెన్స్ కలిగిస్తుందని చెబుతూ ఉంటారు. నిజమే ఇన్సూరెన్స్ చేసుకున్న తర్వాత ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోతే ఇక ఆ ఇన్సూరెన్స్ మొత్తం కుటుంబానికి అందుతుంది. తద్వారా ఇక ఇంటికి పెద్దగా ఉన్న వ్యక్తి దూరమైనప్పటికీ ఆ కుటుంబం ఆర్థిక సమస్యల బారిన పడకుండా ఉంటుంది అని చెప్పాలి. అయితే ఇలాంటి ఇన్సూరెన్స్ ఏకంగా మనుషులను హత్యలు చేసే విధంగా ప్రేరేపిస్తుందా అంటే ఇక్కడ వెలుగులోకి వచ్చిన ఘటన చూసిన తర్వాత అవును అనే సమాధానం చెబుతారు ప్రతి ఒక్కరు.

 ఏకంగా సొంత వారి పేరిట ఇన్సూరెన్స్ చేయించి ఇక ఆ ఇన్సూరెన్స్ డబ్బులను కాజేసేందుకు ఏకంగా సొంతవారినే దారుణంగా హత్యలు చేస్తున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. ఇలా హత్యలకు పాల్పడుతూ వాటిని సహజ మరణాలుగా చిత్రీకరిస్తూ చివరికి ఇన్సూరెన్స్ డబ్బులను క్లైమ్ చేసుకొని లాభపడాలని ఎంతోమంది నీచంగా ఆలోచిస్తూ ఉన్నారు. ఇక్కడ ఇలాంటి ఘటన వెలుగు చూసింది.

 వికారాబాద్ జిల్లాలోని కొండగల్ మండలంలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. రాథోడ్ ధన్ సింగ్ కి ముగ్గురు కొడుకులు ఉన్నారు. ఒక పెద్ద కుమారుడు ఉపాధి కోసం తాండూరు వెళ్ళాడు. మిగతా ఇద్దరు రవి, శ్రీనివాస్ నాయక్ తండ్రితోనే కలిసి  ఉండేవారు. అయితే దన్ సింగ్ కు  చిన్న కుమారుడు రవి ఇన్సూరెన్స్ చేయించాడు. నా కొడుకుకి నా మీద ఎంత ప్రేమో అనుకున్నాడు ఈ విషయం తెలుసు తండ్రి. కానీ తర్వాత కొడుకు తండ్రిని చంపాలని ప్లాన్ వేసాడు. ద్విచక్ర వాహనంపై తీసుకెళ్లి కొండగల్ మండలం గుడిమేశ్వరం గేట్ వద్ద బండరాయితో కొట్టి చంపాడు. ఇక మళ్లీ ఏమీ తెలియనట్టు 108 కి ఫోన్ చేశాడు. రోడ్డు ప్రమాదం జరిగింది అని నాటకం ఆడాడు. తండ్రి మృతి పై అనుమానం వచ్చిన రెండో కొడుకు శ్రీనివాస్ పోలీసులకు ఫిర్యాదుచేయగా.. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టగా అసలు విషయం  వెలుగులోకి వచ్చింది. 50 లక్షల ఇన్సూరెన్స్ కోసమే చిన్న కొడుకు ఇలాంటి దారుణానికి పాల్పడ్డాడు అనే విషయం తేలింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: