ఆన్లైన్లో ఐఫోన్ ఆర్డర్ పెట్టాడు.. కానీ ఏం వచ్చిందో తెలుసా?

praveen
ప్రస్తుతం మనిషి జీవితం మొత్తం ఆన్లైన్ మయం అయిపోయింది అన్న విషయం తెలిసిందే. టెక్నాలజీని బాగా వాడేసుకుంటున్న జనాలు ఇక ఏది కావాలన్నా అరచేతిలో ఉన్న స్మార్ట్ఫోన్లో ఒక్క క్లిక్ ఇచ్చి ఇక ఇంటి ముంగిటికీ తెప్పించుకోగలుగుతున్నారు అని చెప్పాలి. దీంతో సంపన్నుల్లాగా విలాసవంతమైన జీవితాన్ని గడపగలుగుతున్నాడు సామాన్యుడు. అయితే వేసుకునే చెప్పుల దగ్గర నుంచి ఇక తినే ఆహారం వరకు ప్రతి ఒక్కటి కూడా ఆన్లైన్లో అందుబాటులో ఉంది. దీంతో కావాల్సిన వస్తువులు కొనుగోలు చేసేందుకు మనిషి ఎక్కడికో వెళ్లాల్సిన పని లేకుండా పోయింది అని చెప్పాలి.

 దీంతో ఇక టెక్నాలజీ మీద కాస్త అతిగానే ఆధారపడిపోతున్నాడు మనిషి. అయితే ఇలా ఆధారపడటమే అటు సైబర్ నేరగాళ్లకు ఆసరాగా మారిపోతుంది. దీంతో కొన్ని కొన్ని సార్లు ఏకంగా ఈ కామర్స్ ఫ్రాడ్స్ కస్టమర్లకు చుక్కలు కనిపించేలా చేస్తూ ఉన్నాయని చెప్పాలి. ఇక ఇటీవల కర్ణాటక రాష్ట్రంలో ఇలాంటిదే జరిగింది. అతను ఎంతో ఇష్టంగా ఐఫోన్ ఆర్డర్ పెట్టాడూ. ఇక డెలివరీ వచ్చిన తర్వాత ఆతృతగా ఓపెన్ చేసి చూసాడు. కానీ అందులో ఉన్నది చూసి షాక్ అయ్యాడు. ఏకంగా నిర్మ సబ్బుతో పాటు కీప్యాడ్ ఫోన్ డెలివరీ చేశారు. దీంతో షాక్ తిన్న కస్టమర్ వెంటనే కన్జ్యూమర్ కమిషన్ ను ఆశ్రయించాడు.

 దీంతో ఈ కామర్స్ కంపెనీ ఫ్లిప్కార్ట్ కు 25 వేల ఫైన్ విధిస్తూ కన్జ్యూమర్ కమిషన్ దిమ్మతిరిగేలా తీర్పు ఇచ్చింది. ఉప్పల్ పట్టణానికి చెందిన హర్ష అనే విద్యార్థి 49 వేల విలువ చేసే ఐఫోన్ 11 గ్రీన్ 650 జిబి కోసం ఆర్డర్ చేశాడు. దానికి బదులు 140 గ్రాములు ఉన్న డిటర్జెంట్ సోప్ చిన్న కీప్యాడ్ ఫోన్ డెలివరీ అయ్యాయి. న్యాయం చేయాలంటూ వినియోగదారుల ఫోరంను ఆశ్రయించాడు. దీనిపై విచారణ చేపట్టిన వినియోగదారుల ఫోరం తీర్పు వెలువరించింది. ఐఫోన్ కు బదులుగా వేరే వాటిని డెలివరీ చేయడాన్ని తీవ్రంగా తప్పు పట్టింది. ఫ్లిప్కార్ట్ తో   పాటు రీటైలర్ కు కూడా మొట్టి కాయలు వేసింది అని చెప్పాలి. ఈ ఘటన కాస్త స్థానికంగా హాట్ టాపిక్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: