యువకుడి కడుపులో 55 బ్లేడ్లు.. డాక్టర్లు ఏం చేశారంటే?

praveen
సాధారణంగా వైద్యులు అన్న తర్వాత వారి దగ్గరికి ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న పేషెంట్లు వస్తూ ఉంటారు అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఇలా వస్తున్న పేషెంట్లను చూసి చూసి ఇక ఎలాంటి వ్యాధితో బాధపడిన వారు వచ్చినా కూడా డాక్టర్లకు పెద్దగా కొత్తగా అనిపించదు. కేవలం వ్యాధి బారిన పడిన పేషెంట్ కు ఆ వ్యాధి కొత్తగా అనిపిస్తుంది. కానీ ఇక డాక్టర్కు మాత్రం రెగ్యులర్గా చూసే పేషెంట్ ను చూసినట్లుగానే అనిపిస్తూ ఉంటుంది.

 అయితే ఇక ఇలాంటి డాక్టర్లకే షాక్ ఇచ్చే కొన్ని కేసులు కూడా అప్పుడప్పుడు వెలుగులోకి వస్తూ ఉంటాయి అని చెప్పాలి. ఇలా ఎలా జరిగింది? ఇంత జరిగిన తర్వాత మనిషి ఇంకా ఎలా ప్రాణాలతో బ్రతికి ఉన్నాడు అన్న విషయం కూడా డాక్టర్లని ఆశ్చర్యపరిచే విధంగా కొన్ని కేసులు అప్పుడప్పుడు వస్తూ ఉంటాయ్. ఇలాంటిదే ఏదైనా జరిగిందంటే చాలు అది వార్తల్లో కూడా హాట్ టాపిక్ గా మారిపోతూ ఉంటుంది అని చెప్పాలి. ఇక ఇప్పుడు కూడా ఇలాంటి తరహా ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. సాధారణంగా ఒక బ్లేడ్ చేతిలో గట్టిగా పట్టుకుంటేనే తెగి రక్తం కారుతూ ఉంటుంది.

 అలాంటిది ఇక్కడ ఒక యువకుడి కడుపులో ఏకంగా 56 రేజర్ బ్లేడ్లు బయటపడ్డాయి. ఇక ఈ కేసును చూసి అటు డాక్టర్లు సైతం షాక్ అయ్యారు అని చెప్పాలి. రాజస్థాన్లో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. 25 ఏళ్ళ యువకుడి కడుపులో నుంచి 56 రేజర్ బ్లేడ్ లను వైద్యులు వెలికి తీశారు. సంచోరాకి చెందిన యశ్పాల్ సింగ్ అస్వస్థతకు గురి కావడంతో ఇటీవలే ఆసుపత్రికి వెళ్ళాడు.అయితే ఇక అతన్ని కడుపును ఎక్స్ రే తీసిన వైద్యులు ఒకసారిగా షాక్ అయ్యారు. ఎందుకంటే కడుపులో బ్లేడ్లు ఉన్నట్లు గుర్తించిన వైద్యులు మూడు గంటలపాటు శ్రమించి శస్త్ర చికిత్స చేసి బ్లేడ్లను బయటకి తీశారు. అయితే సదరు యువకుడు బ్లేడ్లను ఎందుకు మింగాడు అన్న విషయం పై మాత్రం స్పష్టత రాలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: