రూట్ మార్చిన సైబర్ నేరగాళ్లు.. ఏకంగా వేలిముద్రలతో?

praveen
ఇటీవల కాలంలో మనిషి జీవితంలో మోసం అనేది ఒక భాగంగా మారిపోయింది . అయితే కొంతమంది కేవలం అవసరాన్ని బట్టి మోసానికి పాల్పడుతూ ఉంటే.. మరి కొంతమంది మాత్రం ఇక అమాయకులను టార్గెట్ చేసుకొని మోసాలకు పాల్పడటమే రోజు వారి పనిగా పెట్టుకుంటూ ఉన్నారు అని చెప్పాలి. ఇక ఇలాంటి వారే సైబర్ నేరాలకు పాల్పడుతూ ఎంతో మంది ఖాతాలను ఖాళీ చేస్తున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. అయితే సైబర్ నేరగాళ్ళ విషయంలో ఎంతో అప్రమత్తంగా  ఉండాలని ఓటీపీలు ఎవరికి చెప్పవద్దు అంటూ అటూ సైబర్ పోలీసులు కూడా ప్రతి ఒక్కరికి అవగాహన కల్పిస్తున్నారు.

 అయితే ఇక ఇలా పోలీసుల మాటలు నమ్మి అటు ప్రజలు ఎంత అప్రమత్తంగా ఉన్నప్పటికీ సైబర్ నేరగాళ్లు మాత్రం సరికొత్త దారులను వెతుకుతూ ప్రజలను బురిడీ కొట్టిస్తున్నారు అని చెప్పాలి
 ఇక ఇప్పుడు సైబర్ కేటుగాళ్లు కొత్త మార్గాన్ని ఎంచుకున్నారు అనేది తెలుస్తుంది. మొన్నటి వరకు ఫోన్లో ఓటీపీలు లేదా కొన్ని లింకుల ద్వారా సైబర్ నేరాలకు పాల్పడటం చూసాము. అయితే ఇక ఇప్పుడు ఏకంగా ఖాతాదారులకు వేలిముద్రలో క్లోనింగ్ తో ఖాతాలను కొల్లగొట్టేస్తున్నారు. దేశంలో ఇలాంటి తరహా నేరాలు తరచూ వెలుగులోకి వస్తూనే ఉన్నాయి అని చెప్పాలి.

 నేషనల్ సైబర్ క్రైమ్ పోర్టల్ తెలిపిన నివేదిక ప్రకారం గత ఆరు నెలల కాలంలోనే ఇలాంటి కోవలోకి చెందినవే 4000 కేసులు నమోదయ్యాయట. ఇలాంటి ముఠాలు ఎక్కువగా హర్యానాలో కేంద్రీకృతం అయి ఉన్నట్లు తెలుస్తోంది. ఉత్తరప్రదేశ్ రాజస్థాన్ నుంచి దందా సాగిస్తున్నట్లు ఏపీ సైబర్ పోలీసులు కూడా గుర్తించారు. ఇటీవలే కడప జిల్లాకు చెందిన ఒక వ్యక్తి తన బ్యాంకు ఖాతాలో 90000 విత్ డ్రా  చేసినట్లు గుర్తించి ఫిర్యాదు చేశాడు. దీంతో యూపీ కి చెందిన అంతర్రాష్ట్ర సైబర్ ముఠా గుట్టురట్టు రట్టయింది అని చెప్పాలి.

 ఈ ఘటనలో భాగంగా ఏకంగా 14 మంది సైబర్ కేటుగాళ్లను అరెస్టు చేసి జైలుకు పంపించారు పోలీసులు. విశాఖపట్నంలో కూడా ఇదే తరహా కేసు నమోదు కాగా హర్యానాకు చెందిన ముఠా సభ్యుల గుట్టు రట్టయింది. ఏకంగా 40 మంది సభ్యులను అరెస్టు చేశారు పోలీసులు. అయితే ఇక ఇలా బ్యాంకు ఖాతాదారుల వేలిముద్రల ఆధారంగా ఖాతా ఖాళీ చేయాలి అనుకున్నప్పుడు వివిధ వెబ్సైట్లో నుంచి ఇక సదరు వ్యక్తుల వేలిముద్రలను బట్టర్ పేపర్ పై సైబర్ నేరగాలు కాపీ చేస్తారట. రిజిస్ట్రేషన్లు ట్రెజరీ ఇతర ప్రభుత్వ శాఖల వెబ్సైట్లు లేదా ఆన్లైన్లో రికార్డుల్లో నమోదైన వేలి ముద్రలను కాపీ చేసి అనంతరం ఆధార్ అనుసంధానమైన వ్యక్తుల పేరిట డాక్యుమెంట్లతో ఆన్లైన్ బ్యాంకు ఖాతాలు తెలుస్తారట. దీంతో బాధితుల పేటీఎం ఫోన్ పే గూగుల్ యాప్స్ నేరగాళ్ల నియంత్రణలోకి వస్తాయట. ఇక ఆ తర్వాత ఖాతాలో ఉన్న నగదు కాళీ చేస్తారట. అందుకే ఇలాంటివి ఏమైనా జరిగితే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని హెచ్చరించారు సైబర్ పోలీసులు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: