ఆరేళ్ల చిన్నారి చేతిలో తుపాకి.. చివరికి ఏం చేసిందో తెలుసా?

praveen
ఇటీవల కాలంలో అటు అమెరికాలో గన్ కల్చర్ ఎంతలా పెరిగిపోయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తరచూ ఏదో ఒకటి కాల్పుల ఘటన వెలుగులోకి వస్తూ సంచలనంగా మారిపోతూనే ఉంది. ముఖ్యంగా ఇతర దేశాల నుంచి అమెరికా వలస వచ్చి అక్కడ ఉద్యోగం వ్యాపారం చేస్తూ సెటిల్ అయిన వారిని లక్ష్యంగా చేసుకొని ఎంతోమంది దుండగులు కాల్పులకు తెగబడుతున్నారు అని చెప్పాలి. ముఖ్యంగా ఇక ఇలా జరుగుతున్న ఘటనల్లో ఎక్కువమంది భారతీయులే మృత్యువాత పడుతూ ఉన్నారు. దీన్ని బట్టి చూస్తే అమెరికాలో వలస వెళ్లిన భారతీయులపై కొంతమంది నిజంగా కక్ష కట్టినట్టుగానే వ్యవహరిస్తున్నారేమో అని అనుమానం అందరిలో కలుగుతుంది.

 అంతేకాదు ఇక ప్రస్తుతం అమెరికాలో తుపాకుల విషయంలో రూల్స్ అతిక్రమిస్తున్న వారు ప్రతి ఇంట్లో కూడా ఒక తుపాకీని పెట్టుకుని ప్రమాదాన్ని పక్కలో పెట్టుకుని పడుకుంటున్నారు అని చెప్పాలి. ఇక కొన్ని కొన్ని సార్లు గన్ మిస్ ఫైర్ అయ్యి  కొంతమంది ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్న ఘటనలు కూడా వెలుగులోకి వస్తూ ఉన్నాయి. అయితే ఒకవేళ తుపాకీని తెచ్చుకొని ఇంట్లో పెట్టుకున్న కూడా.. దానిని ఎంతో జాగ్రత్తగా ఉంచాలి. చిన్న పిల్లలు ఆడుకోవడానికి  అసలు ఇవ్వకూడదు అని చెప్పాలి. కానీ ఇక్కడ ఒక 57 ఏళ్ల వృద్ధురాలు మాత్రం ఇలాంటిదే చేసింది. చివరికి చిన్నారిచేతిలో తుపాకీ మిస్ ఫైర్ అయింది అని చెప్పాలి.

 ఈ ఘటన అమెరికాలోని ఫ్లోరిడాలో వెలుగులోకి వచ్చింది. 57 ఏళ్ల వృద్ధురాలు తన ఆరేళ్ల మనవరాలు చేతిలో కాల్పులకు గురైంది అని చెప్పాలి. కారు వెనక సీటులో కూర్చున్న చిన్నారికి చేతికి గన్ ఇచ్చింది. ఆ చిన్నారి ఆడుకుంటూ ఉండగా పొరపాటున తుపాకీని కాల్చింది. దీంతో మిస్ ఫైర్ అయిన బుల్లెట్ కాస్త ముందు సీట్లో కూర్చొని కారు డ్రైవ్ చేస్తున్న బామ్మకు తాకింది. దీంతో ఆమె తీవ్రంగా గాయపడింది. వెంటనే ఆసుపత్రిలో చేర్పించగా ప్రస్తుతం చికిత్స పొందుతూ ఉంది. ఈ ఘటన కాస్తా స్థానికంగా సంచలనగా మారిపోయింది అని చెప్పాలి. అయినా చిన్నపిల్లల చేతికి మారణాయుధాలు ఇవ్వడం ఏంటి అని ఎంతోమంది తిట్టిపోస్తూ ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Gun

సంబంధిత వార్తలు: