
చేపల కూర తిని.. నాలుగేళ్లు నరకం అనుభవించాడు?
మరి కొంతమంది మాత్రం చేపల కూర తింటున్న సమయంలో కాస్త అతిగా ప్రవర్తిస్తూ ఉంటారు. ఏకంగా చేపలో ఉండే ముళ్ళు తీసి పక్కకు పెట్టడంలో తాము ఎక్స్పర్ట్ అన్న విధంగానే వ్యవహరిస్తూ చివరికి చేప ముల్లు గొంతులో ఇరుక్కుపోయి ప్రమాదాల బారిన పడుతూ ఉంటారు అని చెప్పాలి. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన జరిగింది. ఒక వ్యక్తి ఎంతో ఆశగా చేపల కూర ఆరగించాడు. కానీ చివరికి చేప ముల్లు ఇరుక్కుని నానా కష్టాలు పడ్డాడు. నాలుగేళ్ల క్రితం చేపలు కూరతో భోజనం చేస్తూ చేప ముల్లును మింగేసిన సదరు వ్యక్తి నరకయాతన అనుభవించాడు. చివరికి అతనికి శస్త్ర చికిత్స చేసిన వైద్యులు ముల్లును తొలగించారు.
మెదక్ జిల్లా టెక్ మాల్ మండల కేంద్రంలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. సాయిలు అనే వ్యక్తి నాలుగేళ్ల క్రితం చేపల కూరతో భోజనం చేస్తుండగా రెండు అంగుళాల పొడవు గల చేప ముల్లును మింగేసాడు. దీంతో అప్పటినుంచి ఎంతగానో ఇబ్బందులు పడుతూ ఆసుపత్రులు చుట్టూ తిరిగాడు. ఇటీవలే భరించలేని నొప్పి రావడంతో మళ్లీ ఆసుపత్రికి వెళ్ళగా శస్త్ర చికిత్స చేసిన వైద్యులు ఆ ముల్లును బయటకు తీసారు. అంతేకాదు వైద్య వృత్తిలోనే ఇది చాలా అరుదైన అంశంగా వైద్యులు పేర్కొన్నారు అని చెప్పాలి.