వృద్ధుడికి కడుపునొప్పి.. ఏంటా అని చెక్ చేస్తే.. డాక్టర్లే షాక్?

praveen
సాధారణంగా వైద్యుల దగ్గరికి ఎప్పుడు ఎన్నో రకాల వ్యాధులతో బాధపడుతున్న పేషెంట్లు వస్తూనే ఉంటారు. ఈ క్రమంలోనే తమ దగ్గరికి వచ్చిన పేషంట్లను చూస్తూ ఉంటే వారికి ఉన్న వ్యాధి డాక్టర్లకు పెద్దగా కొత్తగా ఏమీ అనిపించదు. అందుకే ఎంత పెద్ద వ్యాధిగ్రహస్తులు డాక్టర్ల దగ్గరికి వెళ్లిన వారికి ట్రీట్మెంట్ ఇచ్చే డాక్టర్లు మాత్రం అది ఒక సాదాసీదా వ్యాధి అన్నట్లుగానే వ్యవహరిస్తూ ఉంటారు.  కానీ ఇటీవల కాలంలో మాత్రం ఎంతోమంది పేషంటు డాక్టర్లకు షాక్ ఇచ్చే సమస్యలతో ఆసుపత్రులకు పరుగులు పెడుతున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి.

 ఇక ఇక్కడ ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది అని చెప్పాలి. ఇటీవలే ఏకంగా  కడుపులో మొబైల్ ఫోన్లు, బ్యాటరీలు,అంతేకాకుండా స్టీల్ గ్లాసులు, స్టీల్ స్పూన్స్ లాంటిది బయటపడుతూ ఉండడం డాక్టర్లని అవక్కయ్యేలా చేస్తుంది. ఇక ఇప్పుడు మధ్యప్రదేశ్ లోని రాజ్ ఘర్ జిల్లాలో కూడా ఇలాంటి తరహా ఘటన వెలుగు చూసింది అని చెప్పాలి.  కొన్ని రోజుల నుంచి ఒక వృద్ధుడు తీవ్రమైన కడుపునొప్పితో బాధపడ్డాడు. అయితే మాత్రలు వేసుకున్న కడుపు నొప్పి తగ్గలేదు. దీంతో జిల్లా ఆసుపత్రిలో చేరాడు. ఈ క్రమంలోనే అతనికి ఏం సమస్య ఉందా అని ముందుగా డాక్టర్లకు కూడా అర్థం కాలేదు.

 ఆ తర్వాత ఏం జరిగి ఉంటుందా అని పరీక్షలు చేసి చూసారు. ఈ క్రమంలోని రిపోర్టులు చూసి అటు డాక్టర్లు సైతం అవాక్కయ్యారు అని చెప్పాలి.  ఏకంగా అతని పొట్టలో గ్లాసు ఉంది. అయితే నాలుగు నెలల క్రితం వేరే గ్రామానికి వెళ్ళిన రాందాస్ అనే వృద్ధుడిని కొంతమంది వ్యక్తులు దారుణంగా కొట్టారు.  అనంతరం ఒక గ్లాస్ పై కూర్చోబెట్టారు. తద్వారా మలద్వారం ద్వారా ఇక గ్లాసు అతని పొట్టలోకి వెళ్లిపోయింది అన్నది తెలుస్తుంది. అయితే ఈ ఘటన జరిగి నాలుగు నెలలు గడిచిన రాందాస్ ఈ విషయం చెబితే పరువు పోతుందని సిగ్గుతో ఎవరికి ఈ విషయం చెప్పుకోలేదు.. చివరికి కడుపునొప్పి రావడంతో ఇక ఆసుపత్రికి వెళ్ళగా ఈ విషయం బయటపడి ఇక స్థానికంగా సంచలనగా మారిపోయింది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: