మర్డర్ మిస్టరీ వీడింది.. ఆ దంపతులను చంపింది ఎవరో కాదు?
వీరికి కుమార్తె అనిత ఉంది.కాగా అనితకు గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం వడ్లమూడి గ్రామానికి చెందిన సాంబశివరావు తో వివాహం జరిపించారు. తల్లిదండ్రులు ఇక వీరి కాపురం ఎంతో సాఫీగా సాగిపోతుంది అనుకుంటున్న సమయంలో మునిపల్లి గ్రామానికి చెందిన కూచిపూడి రాజకుమార్ తో అనితకు పరిచయం ఏర్పడింది. పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది అని చెప్పాలి. అయితే రాజ్ కుమార్ తో వివాహేతర సంబంధం కొనసాగిస్తూనే ఇక మరో వ్యక్తితో కూడా కాస్త చనువుగా ఉంటూ వచ్చింది. ఈ విషయం తెలుసుకున్న ప్రియుడు అనితను నిలదీశాడు.
కొన్నాళ్ళకి అనిత సొంత గ్రామానికి వెళ్లి పోయింది. రాజ్కుమార్ కూడా ఆ గ్రామానికి వెళ్లి అక్కడ అనిత తల్లి రామతులశమ్మ తో గొడవ పడ్డాడు. అయితే ఆమె కూడా అనితను సపోర్ట్ చేస్తున్నట్లు రాజ్ కుమార్ కు అర్థమైంది. అనిత తనకు అంత దూరం కావడానికి వేరే వ్యక్తితో సన్నిహితంగా ఉండడానికి రామతులశమ్మ కారణమని కక్ష పెంచుకున్నాడు రాజ్కుమార్. ఈ క్రమంలోనే ఆమె చంపితే అనిత తనకు దక్కుతుంది అని భావించి హత్యకు పథకం వేశాడు.. తన స్నేహితులతో కలిసి కత్తితో రామతులశమ్మ ఆమె భర్త హనుమంతరావు ను హత్య చేసాడు. ఈ క్రమంలోనే పోలీసులు దర్యాప్తు చేపట్టగా చివరికి మర్డర్ మిస్టరీ ఒక కొలిక్కి వచ్చింది.