ముగ్గురు పిల్లలను కెనాల్లో పడేసి.. తర్వాత ఆమె ఏంచేసిందో తెలుసా?
ఇక్కడ ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది అనే చెప్పాలి. ప్రియుడిని దూరం చేసుకోవడానికి ఇష్టపడని సదరు మహిళ కడుపున పుట్టిన ముగ్గురు పిల్లలను నర్మదా నది కాలువలో తోసి ఆ తర్వాత ప్రియుడితో కలిసి తాను కూడా అందులో దూకి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన గుజరాత్ లోని తరడ్ తాలూకాలో వెలుగుచూసింది. చందర్ అనే గ్రామంలో వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా సంచలనం గా మారిపోయింది. ఉదయం సమయంలో గ్రామ ప్రజలు నర్మదా కాలువ వెంట నడుస్తున్న సమయంలో గట్టుపై సెల్ఫోన్లు కనిపించాయి.
అదే సమయంలో కాలువ లో ఇద్దరు చిన్నారుల మృత దేహాలు తేలియాడుతూ కనిపించడంతో స్థానికులు షాకయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు గజ ఈతగాళ్లు విషయం చేరవెయ్యగా ఇక అక్కడికి వచ్చిన గజఈతగాళ్ళు మృతదేహాలను బయటకు తీశారు. ముక్తబెన్ కు ఈశ్వర్ బాయి అనే వ్యక్తితో 15 ఏళ్ల క్రితం పెళ్లయింది. ముగ్గురు పిల్లలు ఉన్నారు. అయితే ఈశ్వర్ బాయ్ గాంధీ నగర్లో కూలి పని చేస్తున్నాడు. ఈ మధ్య వారి సొంత ఊరికి కూడా మారారు. ఇక అక్కడే ఓ యువకుడితో ముక్తబెన్ శారీరక సంబంధం పెట్టుకుంది. కానీ సభ్య సమాజాన్ని ఎదిరించి ప్రియుడితో బతకడం కుదరదని ఇలా ముగ్గురు పిల్లలను కాలువలో పడేసిన తర్వాత ఆత్మహత్యకు పాల్పడింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.