సింగరేణి కార్మికుడి హత్య.. చంపింది ఎవరో కాదు?

praveen
ఇటీవలి కాలంలో వెలుగులోకి వస్తున్న ఘటనలు చూసిన తర్వాత మనుషుల్లో మానవత్వం పూర్తిగా కనుమరుగై పోయింది అన్నది మాత్రం స్పష్టంగా అర్థం అవుతుంది అని చెప్పాలి. ఎందుకంటే పరాయి వాళ్ళ విషయంలోనే కాదు సొంత వారి విషయంలో కూడా కాస్తయినా జాలి దయ చూపించడం లేదు ఎవరు. వెరసి ఎన్నో దారుణ ఘటనలో వెలుగులోకి వస్తున్నాయి అని చెప్పాలి.  ఏకంగా కట్టుకున్న వారు కన్న వారి ప్రాణాలు తీసేందుకు కూడా వెనకాడటం లేదు నేటి రోజుల్లో మనుషులు. సొంత వారికంటే ఆస్తులు అక్రమ సంబంధాలు ముఖ్యం అనుకుంటూ చివరికి దారుణంగా ప్రవర్తిస్తున్నారూ అని చెప్పాలి.


 ఇటీవలే సింగరేణి కాలరీస్ లో కార్మికుడు దారుణ హత్యకు గురయ్యాడు. అయితే ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు తమదైన శైలిలో విచారణ చేయడం ప్రారంభించాడు. ఈ హత్య వెనుక ఉన్నది ఎవరో కాదు భార్య అతడి ప్రియుడు అనే విషయం పోలీసులు అనుమానిస్తున్నారు. సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ లో రాజేందర్ గౌడ్ అనే కార్మికుడు పనిచేస్తున్నాడు. ఇటీవల తెల్లవారుజామున గోదావరిఖని లోని తన నివాసం లో దారుణ హత్యకు గురయ్యాడు. గుర్తు తెలియని దుండగులు అతని కాల్చిచంపారు. అయితే ఈ సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ మొదలు పెట్టారు.


అయితే నిందితులు తమకు గుర్తుపట్టకుండా ఉండేందుకు హెల్మెట్ పెట్టుకుని వచ్చారు అన్న విషయాన్ని పోలీసులు గుర్తించారు. గాఢనిద్రలో ఉన్న సమయంలోనే ఇలా దగ్గర నుంచి కాల్పులు జరిగినట్లు పోలీసులు తెలిపారు. అయితే అతను చనిపోయాడు అని నిర్ధారించుకున్న తర్వాత నిందితులు అక్కడి నుంచి పరారయ్యారూ. ఇక ఆ తర్వాత రాజేందర్ గౌడ్ భార్య రవలి వెంటనే పోలీసులకు ఫోన్ చేసి హత్య గురించి తెలిపింది. ఇక ఈ హత్యకు నెల క్రితమే ప్లాన్ చేసినట్లు పోలీసులు తెలిపారు. వారిని విచారిస్తే హత్య జరిగిన సమయంలో తాను వాష్ రూమ్ లో ఉన్నానని  పొంతనలేని సమాధానం చెబుతుంది. ఈ క్రమంలోనే రవళి ప్రియుడే హత్య చేయించాడు అన్నది తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: