మహిళ తలలో కండోమ్ ప్యాకెట్.. విషయం తెలిసి డాక్టర్లు షాక్?

praveen
సాధారణంగా వైద్యులు అంటే కలియుగ దైవం అని చెబుతూ ఉంటారు . ఎందుకంటే దేవుడు జన్మనిస్తే ఇక ఏదైనా ప్రమాదం వాటిల్లినప్పుడు డాక్టర్లు మంచి వైద్యం అందించి పునర్జన్మను ఇవ్వడం లాంటివి చేస్తూ ఉంటారు అని చెప్పాలి. ఆ సమయంలో అయితే మానవాళికి వైద్యులు చేసిన సేవ గురించి మాటల్లో చెప్పడం చాలా కష్టం. ఎంతోమంది ఏకంగా ప్రాణాలను పణంగా పెట్టి ప్రజల ప్రాణాలను కాపాడుతుంటారు. కొంతమంది వైద్యులు మాత్రం నిర్లక్ష్యమైనా ధోరణితో  వ్యవహరిస్తూ వైద్య వృత్తికి కళంకం తెచ్చే విధంగా ప్రవర్తించడం వంటివి చేస్తూ ఉంటారు. ఆసుపత్రికి వచ్చిన రోగికి ఉన్న సమస్యలు నయం చేయకపోగా కొత్త సమస్య వచ్చేలా చేస్తూ ఉంటారు వైద్యులు.



 కొన్ని కొన్ని సార్లు ఆపరేషన్ చేసి లోపల ఏదో ఒక వస్తువు మర్చిపోయి అలాగే కుట్లు వేయడం లాంటి ఘటనలు కూడా ఇటీవలి కాలంలో ఎన్నో వెలుగులోకి వస్తున్నాయ్. మధ్యప్రదేశ్ లో ఇటీవలే ఒక విచిత్రమైన ఘటన వెలుగులోకి వచ్చింది. మహిళకు తలకు కట్టుకున్న కట్టు విప్పిన తర్వాత డాక్టర్లకు షాకింగ్ దృశ్యం కనిపించింది. ఏకంగా కండోమ్ ప్యాకెట్ బయటపడుతుందో అందరూ ఒక్కసారిగా అవాక్కయ్యారు. మెరేనా జిల్లాలోని ఓ ఆస్పత్రిలో ఈ ఘటన వెలుగు చూసింది.  ధర్మ ఘర్ కు చెందిన రేష్మా బాయి తలకు గాయం కావడంతో చికిత్స నిమిత్తం పొర్స కమ్యూనిటీ హెల్త్ సెంటర్ లో చేరింది.


 అక్కడి ప్రాథమిక చికిత్స చేసి కట్టు కట్టాడు వైద్యుడు.  అయితే అక్కడే అసలు సమస్య వచ్చి పడింది. ఈ క్రమంలోనే తలకు కట్టు కట్టిన సమయంలో రక్తం బయటకి రాకుండా కాటన్ క్లాత్ పెట్టాల్సింది పోయి కండోమ్ ప్యాకెట్ ఉంచి అలాగే కట్టు కట్టాడు. అనంతరం ఇక మహిళను వేరే ఆస్పత్రికి రిఫర్ చేశాడు. అక్కడికి వెళ్లిన మహిళను వైద్యులు పరీక్షించి ఒక్కసారిగా అవాక్కయ్యారు. మహిళ కట్టు లోపల కండోమ్ ప్యాకెట్ ఉందని తెలుసుకుని షాక్ అయ్యారు. ఇక ఈ విషయంపై ఉన్నతాధికారులు చర్యలు చేపట్టారు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: