ప్రియురాలికి బహుమతి కోసం.. ఇంటి దొంగగా మారాడు.. చివరికి?

praveen
సాధారణంగా ప్రేమలో పడిన తర్వాత ప్రియురాలిని సర్ప్రైస్ చేసేందుకు ప్రియుడు ఏదో ఒక గిఫ్ట్ ఇవ్వడం లాంటివి చేస్తూ ఉంటాడు. ఇలా అరుదైన బహుమతులు ఇచ్చి ఇక ప్రియురాలిని ఆనందంలో ముంచేయాలని  భావిస్తూ ఉంటారు. అయితే ఇటీవలి కాలంలో మాత్రం బహుమతి ఇవ్వడం కోసం ఎంతోమంది నేరాలకు పాల్పడుతూ ఉన్న ఘటనలు మాత్రం ప్రతి ఒక్కరిని అవాక్కయ్యేలా చేస్తున్నాయి అన్న విషయం తెలిసింది. ఇక్కడ కూడా ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రియురాలికి కానుకలు ఇచ్చేందుకు ప్రియుడు దొంగ గా మారిపోయాడు.

 ఇంతకీ అతను ఎవరు ఇంట్లో దొంగతనం చేశాడో తెలుసా ఏకంగా తన సొంత ఇంట్లోనే భార్య తల్లి బంగారు నగలు చోరీ చేసి వాటిని అమ్మి వచ్చిన సొమ్ముతో చివరికి ప్రియురాలికి కారును బహుమతిగా ఇచ్చాడు. ఈ ఘటన తిరువళ్లూరు జిల్లాలో వెలుగులోకి వచ్చింది. పూనమల్లి ముత్తునగర్ కు చెందిన 40 ఏళ్ల శేఖర్ స్వీట్ స్టాల్ నడుపుతూ ఉంటాడు. అయితే ఇటీవలే మనస్పర్థల కారణంగా కొద్ది రోజుల నుంచి భార్య మల్లిక అతనికి దూరంగా ఉంటుంది. బంధువులు రాజీ కుదిర్చి మల్లికను మళ్ళి ఇంటికి తీసుకు వచ్చారు. అయితే ఇలా ఇంటికి వచ్చిన మల్లిక బీరువాలో ఉన్న 300 సవర్ల బంగారు నగలు పరిశీలించగా కనిపించకుండా పోయాయి. అదే సమయంలో శేఖర్ తల్లికి సంబంధించిన 200 సవర్ల బంగారు నగలు కూడా లేవు.

 ఇదే విషయంపై శేఖర్,అతని సోదరుడిని కూడా ప్రశ్నించగా వారికి ఏమీ తెలియదు అంటూ చెప్పారు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. సంఘటనా స్థలానికి  చేరుకున్న పోలీసులు వాటిని పరిశీలించి బీరువా పగలగొట్ట కుండా  ఎలా నగలు మాయం అయ్యాయి అనే కోణంలో దర్యాప్తు చేపట్టారు. చేసింది ఇంటి దొంగలు అని ఒక నిర్ధారణకు వచ్చారు. ఈ క్రమంలోనే శేఖర్ బంగారు నగలను దొంగతనం చేసి ఇక తన ప్రియురాలి కి గిఫ్ట్ ఇచ్చినట్లు తమ విచారణలో తేలింది. అయితే ఇక శేఖర్ ప్రియురాలు స్వాతి కూడా ఒక కిలేడి కావడం గమనార్హం. ఇక భారీగానే డబ్బులు గుంజినట్లు పోలీసుల విచారణలో తేలింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: