ఆన్ లైన్ క్లాసుల కోసం కూతురికి ఫోన్ కొనిస్తే.. చివరికి?

praveen
ఒకప్పుడు చదువుకున్న విద్యార్థులు ఎవరైనా చేతిలో ఫోన్ పట్టుకుంటే చాలు తల్లిదండ్రులు మందలించేవారు. ఫోన్ పక్కన పెట్టి చదువు చదువు మీద దృష్టి పెట్టు అంటూ హెచ్చరించడం లాంటివి చేసేవారు. ఇక ఎవరైనా తల్లిదండ్రుల మాట వినకుండా అదేపనిగా ఫోన్ వాడుతూ ఉన్నారు అంటే ఏకంగా కొన్ని కొన్ని సార్లుకొట్టడం లాంటివి కూడా చేసేవారు అన్న విషయం తెలిసిందే. కానీ ఇటీవలి కాలంలో మాత్రం  తల్లిదండ్రులే బ్రతిమిలాడి మరి పిల్లల చేతికి సెల్ఫోన్ ఇస్తున్న పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే కరోనా వైరస్ కారణంగా విద్యా సంస్థలు అన్నీ మూత పడిన నేపథ్యంలో ప్రతి ఒక్కరు ఆన్లైన్ వేదికగానే తరగతులు వినాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో స్కూల్ పిల్లల దగ్గర నుంచి కాలేజీ స్టూడెంట్స్ వరకు ప్రతి ఒకరి చేతిలో స్మార్ట్ఫోన్ వచ్చేసింది.

 అయితే ఇలా స్మార్ట్ఫోన్ చేతి లోకి వచ్చిన తర్వాత కేవలం ఆన్లైన్ క్లాసులు వినడం మానేసి చివరికి ఇక సోషల్ మీడియాలో ఖాతాలు ఓపెన్ చేసి చాటింగ్ లు చేయడం లాంటి ఘటనలు కూడా వెలుగు చూస్తున్న విషయం తెలిసిందే.  స్మార్ట్ ఫోన్  కారణంగా ఎంతోమంది విద్యార్థులు పెడ దారి పడుతున్నారు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇక్కడ ఆన్లైన్ క్లాస్ కోసం ఫోన్ కొనిస్తే చివరికి మొదటికే మోసం వచ్చింది. ఈ ఘటన ఖమ్మం జిల్లా కారేపల్లి మండలంలో వెలుగులోకి వచ్చింది.

సిద్దేశ్ అనే 22 ఏళ్ళ యువకుడు ఇంస్టాగ్రామ్ వేదికగా బాలికను వేధించాడు. ఆమె తో చాటింగ్ చేసి ఏకంగా ఫోటోలు కూడా స్వీకరించాడు. ఆ తర్వాత ఫోటోలు చూపించి బ్లాక్మెయిల్  చేయడం మొదలుపెట్టాడు. ఫోటోలు డిలీట్ చేయాలంటే డబ్బులు ఇవ్వాలి అంటూ బాలికను బెదిరించాడు. కొన్నాళ్లపాటు ఈ విషయం ఎవరికి చెప్పుకోవాలో తెలియక భయపడిపోయిన బాలిక తల్లిదండ్రులకు విషయం చెప్పింది. దీంతో బాలిక తండ్రి ఫిర్యాదు తో పోలీసులు కేసు నమోదు చేసి అతన్ని అరెస్టు చేశారు. ఫోన్ లు కొనడమే కాదు అందులో వారు ఏం చేస్తున్నారో కూడా గమనించాలి అంటూ పోలీసులు సూచించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: