అగ్నిపథ్ ఆందోళన.. నిరసన ముసుగులో దొంగతనం?

praveen
త్రివిధ దళాల్లో నియామకాల కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన అగ్నిపత్ పథకం దేశవ్యాప్తంగా ఉద్రిక్త పరిస్థితులకు కారణం అయింది అన్న విషయం తెలిసిందే. ఇప్పుడు వరకు పరీక్షలు రాసి ఆర్మీ ఉద్యోగాలు వస్తాయని ఎదురుచూస్తున్నా ఎంతోమంది యువకులు ఇక కేంద్ర ప్రభుత్వం తీరుపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే గత కొన్ని రోజుల నుంచి అగ్నిపత్ పథకాన్ని వెంటనే రద్దు చేయాలంటూ డిమాండ్ చేస్తూ ఆందోళనలు చేపడుతున్నారు అన్న విషయం తెలిసిందే. ఈ ఆందోళనలు రోజురోజుకు తీవ్రతరం అవుతున్నాయి.

 ఇప్పటికే ఆందోళన చేపడుతు యువకులు అందరూ కూడా అటు రైల్వే స్టేషన్లలో  సృష్టించిన విధ్వంసం అంతా ఇంతా కాదు. ఇక దేశవ్యాప్తంగా ఉన్న ఆందోళనకారులు అందరూ కూడా ఆయా రాష్ట్రాల్లో రైల్వే స్టేషన్లో ఎన్నో ఆస్తులను ధ్వంసం చేశారూ. అంతే కాదు రైళ్లను తగలబెట్టారు. ఈ క్రమంలోనే ఇక దేశంలో ఎక్కడ చూసినా హింసకాండ జరుగుతుంది అని చెప్పాలి. అయితే ఇక నిన్న దేశవ్యాప్తంగా రైల్వే స్టేషన్ లో పెద్ద ఎత్తున అల్లర్లు చోటుచేసుకున్నాయ్ అన్న విషయం తెలిసిందే. ఇక ఇదే సమయంలో కొంతమంది మాత్రం నిరశన ముసుగులో చోరీలకు పాల్పడ్డారు. బీహార్లోని ఓ రైల్వే స్టేషన్లు ఏకంగా మూడు లక్షల నగదును ఆందోళనకారుల ఎత్తుకు  వెళ్లినట్లు పోలీసు వర్గాలు వెల్లడించాయి.

 బీహార్లోని ఆరాహ్ ప్రాంతంలో బియా రైల్వే స్టేషన్ వద్ద యువత ఆందోళనకు దిగింది. అయితే స్టేషన్లోని దుకాణాలు కూడా ధ్వంసం చేశారు. ఈ క్రమంలోనే కొంతమంది ఆందోళనకారులు టికెట్ కౌంటర్ లో కి రాళ్లు విసరడంతో అక్కడ ఉన్న సిబ్బంది భయంతో అక్కడి నుంచి పారిపోయారు. ఈ క్రమంలోనే అక్కడ కౌంటర్లో ఉన్న మూడు లక్షల రూపాయల నగదు ఎత్తుకెళ్లారని అధికారులు గుర్తించారు. ఇక బీహార్ లో ఏకంగా 5 రైళ్లకు ఆందోళనకారులు నిప్పుపెట్టారు. అయితే ఉద్యోగాలు రావడం లేదని నిరసన చేయడం వరకు ఓకే గాని నిరశన ముసుగులో ఇలాంటి దొంగతనాలు ఏంటి అని కొందరు ప్రశ్నిస్తున్నారు .

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: