వామ్మో మహిళా స్మగ్లర్.. బంగారం అక్కడ దాచి పెట్టింది?

praveen
ఇటీవలి కాలంలో అక్రమార్కులు సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది  అన్న విషయం తెలిసిందే. పోలీసులు ఎక్కడికక్కడ నిఘా ఏర్పాటు చేసినప్పటికీ అక్రమార్కులు మాత్రం ఎక్కడా వెనకడుగు వేయడం లేదు. కొంత మంది అక్రమార్కులు లోకల్ గా నేరాలకు పాల్పడుతుంటే.. మరికొంతమంది తమ పరిధిని పెంచుకుని ఏకంగా వివిధ దేశాల మధ్య అక్రమాలకు పాల్పడుతూ ఉండటం లాంటివి చేస్తూ ఉన్నారు. ఇక ఇటీవల కాలంలో ఎయిర్ పోర్టుల ద్వారా  అక్రమంగా మాదక ద్రవ్యాలు విదేశీ కరెన్సీ లేదా బంగారం లాంటి తరలించేందుకు ప్రయత్నిస్తూ ఉండటం గమనార్హం.

 ఇక ఇలాంటి ఘటనలు పెరిగిపోయిన నేపథ్యంలో ఎక్కడికక్కడ పటిష్టమైన నిఘా ఏర్పాటు చేస్తున్న కస్టమ్స్ అధికారులు స్థానికులు ఎవరైనా కాస్త అనుమానం గా కనిపించారు అంటే చాలు వెంటనే వారిని చెక్ చేయడం లాంటివి చేస్తూ ఉన్నారు. ఒకవేళ అక్రమాలకు పాల్పడినట్లు తేలితే ఇక నేరుగా జైలుకు తరలించి అక్కడి అధికారులకు దొరకకుండా అక్రమాలకు పాల్పడేందుకు వినూత్నమైన దారులను వెతుకుతున్నారు అన్న విషయం తెలిసిందే. పురుషులు మహిళలు అనే తేడా కూడా లేకుండా ఇక ఇలాంటి నేరాలకు పాల్పడుతున్న ఘటనలు మాత్రం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి అని చెప్పాలి.

 ఇక్కడ ఇలాంటి తరహా ఘటన వెలుగు లోకి వచ్చింది. హైదరాబాద్లోని శంషాబాద్ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. కువైట్ నుంచి వచ్చిన ఒక మహిళ వద్ద 86 లక్షల విలువచేసే 1.64 కిలోల బంగారం గుర్తించారు. అయితే కస్టమ్స్ అధికారులకు దొరక్కుండా బంగారాన్ని పేస్టు రూపంలో లో దుస్తువులు షూ సాక్స్ లో దాచి పెట్టి సదరు మహిళ తీసుకు వచ్చేందుకు ప్రయత్నం చేసింది. అయితే మహిళ ప్రవర్తన అనుమానంగా కనిపించడంతో ఇక తనిఖీ చేసిన అధికారులు చివరికి బంగారం ఉందని కనుగొని సీజ్ చేశారు. మహిళలను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: