క్రికెట్ ప్రాణం తీసింది.. ఏం జరిగిందంటే?

praveen
భారత్లో క్రికెట్ కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకం గా చెప్పాల్సిన పని లేదు. చిన్నల నుంచి పెద్దల వరకూ ప్రతి ఒక్కరు కూడా క్రికెట్ ని ఆస్వాదిస్తూ ఉంటారు. క్రికెట్ మ్యాచ్ వచ్చిందంటే టీవీలకు అతుక్కు పోయి మరి మ్యాచ్ వీక్షిస్తూ ఉంటారు. ఇక కాస్త సమయం దొరికిందంటే చాలు స్నేహితుల తో కలిసి మైదానం లోకి చేరి క్రికెట్ ఆడటానికి ఎక్కువగా ఇష్ట పడుతుంటారు అని చెప్పాలి. ఇలా ఇటీవలి కాలం లో క్రికెట్ అనేది ప్రతిఒకరికి ఎంటర్టైన్మెంట్ అందించే ఆట గా మారి పోయింది. అయితే ఇలా ప్రతి ఒక్కరికి ఇష్టమైన క్రికెట్ ఇక్కడ ఒక కుటుంబం లో విషాదం నింపింది.

 ఎంతో ఆనందం గా క్రికెట్ ఆడుతున్న యువకుడు ఊహించని విధంగా ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషాదకర ఘటన పూణేలో వెలుగు చూసింది. స్నేహితుల తో కలిసి క్రికెట్ ఆడుతున్న 22 ఏళ్ల యువకుడు గ్రౌండ్లో ఒక్కసారిగా కుప్పకూలి పోయాడు. వెంటనే అతన్ని ఆస్పత్రికి తరలించినప్పటికి కూడా లాభం లేకుండా పోయింది అని చెప్పాలి. కాగా మృతి చెందిన యువకుడు పేరు శ్రీతేజ్ అనీ  తెలుస్తుంది.  ఇటీవలే స్నేహితులతో కలిసి క్రికెట్ ఆడటానికి మైదానానికి వచ్చాడు సదరు యువకుడు. ఇక మ్యాచ్ జరుగుతున్న సమయం లోనే ఒక్క సారిగా కుప్పకూలి పోయాడు.

 పక్కనే ఉన్న స్నేహితులు అతని వద్దకు చేరుకునే సమయానికి అతను స్పృహలో లేడు. దీంతో స్నేహితులు మరింత భయపడిపోయారు. వెంటనే అతని పక్కనే ఉన్న ఆస్పత్రికి తరలించారు. దీంతో ఇక గుండెపోటుతో సదరు యువకుడు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. దీంతో ఒక్కసారిగా షాక్ లో మునిగి పోయిన స్నేహితులు అతని మరణవార్తను అతని కుటుంబ సభ్యులకు తెలియజేయడం గమనార్హం. ఇక  అల్లారుముద్దుగా పెంచుకున్న కొడుకు మరణ వార్త విన్న తల్లిదండ్రులు జీర్ణించుకోలేకపోయారు. ఈ క్రమంలోనే అరణ్యరోదనగా విలపించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: