కొడుక్కి భారం కాకూడదని.. ఆ తల్లిదండ్రులు ఏం చేశారో తెలుసా?

praveen
తల్లి దండ్రులు అంటే ఎప్పుడూ పిల్లల సుఖాన్ని కోరుకుంటూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. పిల్లలు ఎప్పుడు ఆనందం గా ఉండడానికి తమ జీవితాన్ని త్యాగం చేస్తూ ఉంటారు తల్లి దండ్రులు. అందుకే తల్లి దండ్రులను మించిన దైవం ఉండదు అని చెబుతూ ఉంటారు అందరు. ఈ క్రమం లోనే ఇక పిల్లలు ఎంత ఎదిగినా తల్లి దండ్రులకు మాత్రం ఇంకా చంటి పిల్లాడి లాగానే కనిపిస్తూ ఉంటారు. అందుకే ఎంతో ప్రేమగా చూసు కోవడం కూడా చేస్తూ ఉంటారూ. అయితే ఇక్కడ తల్లి దండ్రులు తమ కొడుకు కోసం ఏకంగా తమ ప్రాణాలనే వదులుకునేందుకు సిద్ధమయ్యారు.

 కొడుకుకి భారం అవుతున్నాము అని భావించి మన స్థాపంతో చివరికి ఆత్మహత్య చేసుకున్నారు వృద్ధ దంపతులు. ఈ విషాదకర ఘటన కామారెడ్డి జిల్లా లో వెలుగు లోకి వచ్చింది. తమ పని తాము చేసుకో లేక పోతున్నామనే దిగులు ఇక కొడుకుకు భారమై పోతున్నామనే బాధ.. చివరికి వారిని ఆత్మహత్య చేసుకునేంత వరకు తీసుకు వచ్చింది. లింబయ్య, ఓడ్డెమ్మ దంపతులకు  ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు గతం లో చనిపోగా చిన్న కుమారుడైన లింబాద్రి వద్దే ఉంటున్నారు.  ఇక లింబాద్రి కి భార్య ఇద్దరు కుమారులు ఉండడం గమనార్హం.

 సరిగ్గా ఆరు నెలల క్రితం ఒడ్డెమ్మ చూపు కోల్పోవడం తో ఇక భర్త లింబయ్య కుమారుడు లింబాద్రి ఇక అన్ని  బాగోగులు చూసుకుంటున్నారు. అయితే ఇటీవలే లింబయ్య కూడా అనారోగ్యానికి గురికావడం గమనార్హం. ఇక ఇద్దరు వృద్ధ దంపతులు ఒకరి సహాయం లేకుండా కనీసం మంచం మీద నుంచి పైకి లేవలేని పరిస్థితిలోకి చేరుకున్నారు. ఇక కోడలు కూడా పెద్దగా పట్టించుకోకపోవడంతో ఎంతగానో మనస్తాపం చెందారు. వృద్ధాప్యంలో కొడుక్కి భారం కాకూడదు అనే ఉద్దేశంతో చివరికి ఈ వృద్ధ దంపతులు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: