వయస్సు 75.. కేసులు 100.. ఆమె ఏం చేసిందో తెలుసా?

praveen
ఇటీవలి కాలంలో ఎక్కువగా మంచి దొంగలే కనిపిస్తున్నారు అన్న విషయం తెలిసిందే.. ఏంటి మంచి దొంగలా.. వాళ్ళు ఎలా ఉంటారు అని అనుకుంటున్నారు కదా. వాళ్లు ఎంతో మంచి వాళ్ళలా కనిపిస్తారు.. వాళ్లను చూసి ప్రతి ఒక్కరు కూడా  గుడ్డిగా నమ్మేస్తూ ఉంటారు. ఇలా నమ్మకం సాధించిన తర్వాత వారి అసలు రూపాన్ని బయట పెడతూ అప్పుడు దొంగతనాలు చేయడం చేస్తూ ఉంటారు. ఇక్కడ ఒక 75 ఏళ్ల బామ్మ కూడా ఇలాంటిదే చేసింది.

 75 ఏళ్ల వయస్సు వచ్చిన తర్వాత ఎవరైనా సరే కృష్ణా రామా అనుకుంటూ మనవళ్లు మనవరాళ్లతో ఇంట్లో హాయిగా రెస్ట్ తీసుకుంటూ ఉంటారు. ఇక కాస్త ఓపిక ఉంటే దర్శనం కోసం వివిధ గుళ్ళూ గోపురాలు తిరుగుతూ ఉంటారు. ఇక్కడొక బామ్మ మాత్రం 75 ఏళ్ల వయస్సులో అందరూ షాక్ కి గురి అయ్యే పని చేసింది. ఇక 75 ఏళ్ల వయసులో కూడా ఆ బామ్మ పోలీసులకు మోస్ట్ వాంటెడ్ లిస్టులో ఉంది అని చెప్పాలి. అయితే ఇలా మోస్ట్ వాంటెడ్ లిస్టులో ఆమె ఉండడానికి కారణం ఆమె తరచూ ఆలయాలకి వెళుతూ ఉండడమే.

 ఆలయాలకు వెళ్లి పూజలు చేస్తే మోస్ట్ వాంటెడ్ ఎందుకు అవుతుంది అని అనుకుంటున్నారు కదా. అక్కడ ఈ బామ్మ చేసే పని తెలిస్తే మాత్రం  షాకవుతారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లి కి చెందిన సరోజిని 75 ఏళ్ళ వయస్సులో ఎక్కువ గుళ్ళూ గోపురాలు తిరుగుతూ ఉంటుంది. అక్కడే ఉన్న వేడుకలో పాల్గొంటోంది. ఇకపోతే ఇటీవలే ఒక ఆలయంలో వెళ్ళింది. అక్కడ కొంత మంది మహిళ మెడలో బంగారు ఆభరణాలు చోరీకి గురయ్యాయి. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు విచారణ జరిపి అసలు దొంగ ఎవరో తెలిసి ఆశ్చర్యపోయారు. 75 ఏళ్ల బామ్మ చోరీలు చేసిందట. కృష్ణ గుంటూరు పల్నాడు కోనసీమ కాకినాడ ఇలా రాష్ట్రవ్యాప్తంగా దొంగతనాలు చేశాడు. 75 ఏళ్ల వయసున్న ఈ బామ్మ పై వివిధ పోలీస్ స్టేషన్ లో వందకు పైగా కేసులు నమోదైనట్లు పోలీసులు గుర్తించారు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: