అమ్మ చనిపోవటంతో డిప్రెషన్.. ఏం చేసాడో తెలుసా?

praveen
డిప్రెషన్.. డిప్రెషన్.. డిప్రెషన్ జీవితంలో ప్రతి ఒక్కరిని వేధిస్తున్న సమస్య ఇది. కొంత మంది ఆరోగ్య సమస్యల కారణంగా డిప్రెషన్ లోకి వెళ్తే మరికొంతమంది జీవితం సాఫీగా సాగడం లేదని డిప్రెషన్ లోకి వెళ్తున్నారు. మరికొంతమంది ఇక ప్రియమైనవారూ దూరమవుతున్నారని డిప్రెషన్ లోకి వెళ్తున్నారూ. అయితే ఒకసారి డిప్రెషన్లోకి వెళ్లిన తర్వాత తీసుకునె నిర్ణయాలు ఎంతో కఠినంగా ఉంటాయి అన్న విషయం తెలిసిందే.  ఏకంగా ఆత్మహత్యలు చేసుకోవడానికి కూడా వెనకాడరు. అందుకే ఇటీవలి కాలంలో డిప్రెషన్ కారణంగా ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకుంటూ బలవన్మరణాలకు పాల్పడుతున్న ఘటనలే ఎక్కువగా వెలుగులోకి వస్తున్నాయ్.

ఇక్కడ ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది అని చెప్పాలీ. ఇక్కడ ఓ యువకుడు తల్లి దూరమైందనె కారణంతో ఎంతగానో కుంగిపోయాడు. ఇక తల్లి లేని జీవితాన్ని అసలు ఊహించుకోలేక పోయాడు. ఎన్నో రోజుల పాటు బ్రతక డానికి ప్రయత్నించాడు. కానీ తల్లి లేకుండా ఇక బతకలేను అని నిర్ణయించుకున్నాడు. చివరికి తల్లి దగ్గరికి వెళ్ళాలని అనుకున్నాడు. ఎంతో బాధతో నిండిపోయినా హృదయంతో ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు.. చివరికి నిండు నూరేళ్ల జీవితాన్ని అర్ధాంతరంగానె ముగించాడు.

 ఈ ఘటన కర్ణాటక లోని మండ్య జిల్లా శ్రీరంగపట్నం నిమిషాంబ ఆలయం సమీపం లో వెలుగు లోకి వచ్చింది. కావేరి నదిలో పడి ఖరీదైన బీఎండబ్ల్యూ కారు కనిపించడం తో స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. కాగా సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు వాహనాలు వెలికితీసి దర్యాప్తు చేశారు. దీంతో అసలు విషయం వెలుగు లోకి వచ్చింది. రూపేష్ అనే వ్యక్తి తల్లి మరణం తో డిప్రెషన్ లోకి వెళ్ళి పోయాడు. ఈ క్రమంలోనే కారు నడిపిస్తూ ఇక నదిలోకి దూసుకెల్లాడు. అయితే తల్లి చనిపోయిన నుంచి అతని మానసిక స్థితి బాలేక ఒంటరిగానే ఉంటుందని స్థానికులు కూడా చెప్పడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: