పాఠశాలలోనే అత్యాచారం.. ఇంతకీ ఏం జరిగిందంటే?
ఆడపిల్ల ఒంటరిగా కనిపిస్తే అత్యాచారాలు చేస్తున్న గ్రామస్తులు కొంత మంది అయితే.. మంచి వాళ్ళం అనే ముసుగు వేసుకొని సమయం సందర్భం కోసం ఎదురు చూసి చివరికి అఘాయిత్యాలకు పాల్పడుతున్న వారు మరికొంత మంది. ఇక సొంత వారి దగ్గర తమ సమస్యలు చెప్పుకోవడానికి వెళ్తే చివరికి లైంగిక వేధింపులకు పాల్పడుతున్న నీచులు ఇంకొంత మంది. వెరసి రోజు రోజుకు అటు ఆడపిల్లల భద్రత ప్రశ్నార్థకం గా మారి పోతోంది.
ఇక్కడ ఇలాంటి తరహా ఘటన వెలుగు లోకి వచ్చింది. నమ్మి వచ్చిన ఎనిమిదో తరగతి బాలిక పై ప్రాథమికోన్నత పాఠశాల ఆవరణలోనే ఓ యువకుడు దారుణం గా అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఈ ఘటన హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం లోని ఓ గ్రామంలో వెలుగు లోకి వచ్చింది. బాలికకు ఫోన్ చేసి మాయ మాటలు చెప్పిన శ్రీకాంత్ అనే యువకుడు రాత్రి సమయం లో ఆమెను పాఠశాల ఆవరణ లోకి రమ్మని పిలిచాడు. అక్కడికి వెళ్ళిన బాలిక పై అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితురాలి తల్లి దండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడం తో కేసు నమోదు చేసిన పోలీసులు యువకుడిని అదుపు లోకి తీసుకున్నారు. ఈ ఘటనలో మరో నలుగురు యువకులను కూడా అదుపు లోకి తీసుకుని విచారిస్తున్నారు..