ఓరి నాయనో.. సమోసా తిన్నాడని.. ప్రాణం తీశాడు?

praveen
సాధారణంగా మనుషులు అన్న తర్వాత చిన్న చిన్న విషయాల్లో గొడవలు జరగడం కామన్.. ఇక ఇలాంటి గొడవలు జరిగినప్పుడు కొన్ని కొన్ని సార్లు వాగ్వాదానికి దిగడంతో ఇక ఆ తర్వాత సర్దుకుపోవడం లాంటివి చేస్తూ ఉంటారు.  కానీ ఇటీవలి కాలంలో మాత్రం చిన్నపాటి గొడవలు ఏకంగా ఒకరిని ఒకరు చంపుకునేంత వరకు దారితీస్తున్నాయి.. ఇక మనుషుల ప్రాణాలు తీయడానికి కాస్తయినా వెనకాముందు ఆలోచించని సాటి మనుషులు ఉన్మాదులు గా  మారిపోయి ప్రాణాలను గాల్లో కలిపేస్తూ ఉంటారు. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది.



 ఫుల్లుగా మద్యం తాగిన ఒక వ్యక్తి షాపుకి వెళ్లి సమోసా తిన్నాడు. ఈ క్రమంలోనే డబ్బులు చెల్లించాలి అంటూ ఆ షాపు యజమాని కోరాడు. దీంతో ఆ ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఇక ఈ వాగ్వాదం కాస్త ఒకరిపై ఒకరు కిందామీదా పడి కొట్టుకునేంత వరకు వెళ్ళింది. చివరికి ఈ గొడవ ఒకరి ప్రాణం పోవడానికి కారణం అయ్యింది. దీంతో ఈ ఘటన కాస్తా స్థానికంగా సంచలనం గా మారిపోయింది అని చెప్పాలి. సోలా ప్రాంతంలోని శంకర్ నగర్ లో వినోద్  అనే వ్యక్తి ఫుల్లుగా మద్యం తాగాడు. ఆ తర్వాత ఆకలేసి పక్కనే ఉన్న ఒక షాప్ దగ్గరికి వెళ్ళాడు.


 అక్కడ షాప్ లో వేడి వేడి సమోసాలు ఉండటం చూసి అతని నోరు ఊరిపోయింది. దీంతో అక్కడికి వెళ్లిన సదరు వ్యక్తి మద్యం మత్తులో షాపు యజమాని పర్మిషన్ లేకుండానే సమోసాలు తినడం మొదలుపెట్టాడు. ఇక ఇదంతా చూసిన షాపు యజమాని కోపం నషాళానికి అంటింది. అయినప్పటికీ కాస్త ఓపిక పట్టి డబ్బులు ఇవ్వాలి అంటూ చెప్పాడు. దీంతో ఇక మందుబాబు షాపు యజమాని హరిసింగ్ తో వాగ్వాదానికి దిగాడు.  ఈ క్రమంలోనే మాటా మాటా పెరగడంతో చివరికి కర్రలతో అతని తలపై బలంగా కొట్టాడు. దీంతో మద్యం మత్తులో ఉన్న అతను విగతజీవిగా అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. వెంటనే అతన్ని స్థానికులు ఆస్పత్రికి తరలించారు. అతన్ని పరీక్షించిన వైద్యులు అప్పటికే చనిపోయాడు అంటూ తెలిపారు. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: