మీకు 50, నాకు 25.. యువతి పెళ్లి ప్రపోజల్.. చివరికి?

praveen
నేటి రోజుల్లో మనిషి మోసానికి కేరాఫ్ అడ్రస్ గా మారిపోయాడు. ఎందుకంటే ఉద్యోగం వ్యాపారం చేసుకుని వచ్చిన దాంట్లో సర్దుకుపోయి జీవించడం కంటే మోసాలకు పాల్పడి ఇక అందినకాడికి దోచుకోవడానికి ఇక ఎక్కువగా ఇష్టపడుతున్నారు. దీంతో సాటి మనుషులను మాయమాటలతో మోసం చేసి భారీగా డబ్బులు దండుకోవడానికి ఎలాంటి పని చేయడానికైనా సిద్ధపడుతున్నాడు ఒకప్పుడు మానవతా విలువలు కలిగిన మనిషి.


 ఆడవాళ్ళు మగవాళ్ళు అనే తేడా లేకుండా అందరూ మోసాలకు  పాల్పడుతున్నారు. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన జరిగింది. అతని వయసు 50 ఏళ్లు అతనికి ఇటీవల 25 ఏళ్ల అమ్మాయి పరిచయమైంది.  పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను  వయసుతో నాకు సంబంధం లేదు అంటూ అబద్ధపు ప్రేమ వలక పోసి మాయమాటలతో నమ్మించింది. ఆ తర్వాత వివిధ కారణాల చెప్పి ఏకంగా నలభై ఆరు లక్షల వరకు కాజేసింది. దీంతో ఆ తర్వాత తేరుకున్న బాధితుడు తాను మోసపోయానని గ్రహించి వెంటనే సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు.


 జూబ్లీహిల్స్ నివాసముండే 50 ఏళ్లు దాటిన ఒక వ్యక్తి రెండో వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు  ఇటీవలే తన ప్రొఫైల్ ని మ్యాట్రిమోనీ సైట్ లో పెట్టాడు  ఇక ఇలా తన ప్రొఫైల్ పెట్టిన రెండో రోజే ఒక 25 ఏళ్ల యువతి ఫేస్బుక్ ఖాతా నుంచి ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టింది. సదరు వ్యక్తి అంగీకరించారు. మీ ప్రొఫైల్ నేను మ్యాట్రిమోనీ సైట్ లో చూశాను. మీరు నాకు నచ్చారు.. మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను.. వయసుతో నాకు సంబంధం లేదు. నేను ఇంజినీరింగ్ చదువుతున్నాను అంటూ చెప్పింది. మాటలతో నమ్మించి ఇంజనీరింగ్ ఫీజ్ అంటూ ఒకసారి.. కోవిడ్ వచ్చింది అంటూ మరోసారి ఇలా పలు కారణాలతో 46 లక్షలు లాగేసింది. తర్వాత పత్తా లేకుండా పోయింది. మోసపోయానని గ్రహించిన బాధితులు పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: