వరుసకు చెల్లిలితో ప్రేమ..కుటుంబసభ్యులు అభ్యంతరం తెలపడంతో..
ఇది నిజంగా భాదాకర ఘటన అని చెప్పాలి. క్షణాకావేషంలో తీసుకున్న నిర్ణయం తో కుటుంబం మొత్తం దుఃఖంలో మునిగిపోయారు.. వివరాల్లొకి వెళితే.. బిహార్ లో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.బంకాలోని కటోరియా పోలీస్ స్టేషన్ పరిధిలోని బదాసన్ గ్రామానికి చెందిన, వరుసకు అన్నాచెల్లెళ్లు అయిన యువతీయువకులు ప్రేమలో పడ్డారు. ఆరు నెలల క్రితం వీరి ప్రేమ గురించి కుటుంబ సభ్యులకు తెలిసింది. దాంతో వారిద్దరిని మందలించారు.. వరుస కాదు ఇలాంటివి తప్పు అని నచ్చ చెప్పే పని చేశారు.
యువకుడిని అతడి తల్లిదండ్రులు కోల్‌కతా పంపించారు. చాలా రోజుల తర్వాత గత ఆదివారం ఆ యువకుడు గ్రామానికి వెళ్ళాడు.. ఈ మేరకు అతని తన ప్రియురాలిని కలుసుకున్నాడు.ఇద్దరూ అదే రోజు రాత్రి గ్రామానికి సమీపంలో ఉన్న పొలాలకు వెళ్లి మాట్లాడుకున్నారు.వారిద్దరికి పెళ్ళికి పెద్దలు అస్సలు ఒప్పుకోరు అని భావించి ఇద్దరూ కలిసి ఓ చెట్టుకు ఉరేసుకుని చనిపోయారు. ఉదయం గ్రామస్థులు పొలాల వద్దకు వెళ్లి చూడగా చెట్టుకు వేలాడుతున్న ఇద్దరి మృతదేహాలు కనిపించాయి..ఈ ఘటన పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాలను పోస్ట్ మార్టం కోసం ఆసుపత్రికి తరలించారు.. పూర్తీ వివరాలు తెలియాల్సి ఉంది..