బిందె నీరు 1.30 లక్షలు.. ఎక్కడో తెలుసా?
కానీ ఇక్కడ మాత్రం ఏకంగా అలా బిందెడు నీటిని 1.30 లక్షల విక్రయించడం సంచలనంగా మారిపోయింది. ఈ ఘటన ఒడిషాలో వెలుగులోకి వచ్చింది. ఒడిషాలోని భువనేశ్వర్లో ముక్తేశ్వర ఆలయం ప్రాంగణంలో ఉన్న మరీచి గుండంలో బిందె నీటిని 1.30 లక్షల విక్రయించారు. ఇక అయినప్పటికీ ఎంతో మంది జనాలు ఈ గుండంలో నీటిని కొనడానికి ఆసక్తి చూపుతూ ఉండటం గమనార్హం. మరి ఈ గుండంలోని నీటికి అంతలా డిమాండ్ ఉండడానికి వెనక అసలు స్టోరీ ఏముంది అని అనుకుంటున్నారు కదా.. ఆ స్టోరీ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.. లింగరాజ స్వామి రుకున యాత్రలో భాగంగా ఏటా అశోక అష్టమి ముందురోజు రాత్రి మరీచి గుండం లో నీటిని విక్రయించేందుకు వేలం నిర్వహిస్తూ ఉంటారు.
లింగరాజు ఆలయంలో ఉండే బడునియోగ్ కవర్గానికి చెందిన సేవాయత్ లు ఈ ప్రక్రియ నిర్వహిస్తారు. ఈ క్రమంలోనే ఇటీవల రాత్రి సమయంలో వేలంపాట జరగగా ఇక తొలి బిందె నీటి ధర వేలం 25 వేల తో ప్రారంభమైంది. భువనేశ్వర్ లోని భారముండా ప్రాంతానికి చెందిన దంపతులు 1.30 లక్షలకు నీటిని కొనుగోలు చేశారు. ఇక రెండో బిందెను 47 వేలకు మూడో బిందెను 13 వేలకు భక్తులు దక్కించుకోవడం గమనార్హం.మిగిలిన నీటిని పేద ప్రజలకు ఉచితంగా పంపిణీ చేశారు. ఈ నీటితో స్నానం చేస్తే సంతాన ప్రాప్తి కలుగుతుందని అనారోగ్య సమస్యలు కూడా తొలగిపోతాయి భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తుంటారు ఇక ఈ గుండం చుట్టుపక్కల ఉన్న అశోక చెట్ల వేర్ల ప్రభావం కారణంగా ఈ నీటిలో ఔషధ గుణాలు ఉన్నాయని స్థానికులు అంటున్నారు. అయితే 2019 జరిగిన వేలంలో బిందెడు నీటిని 2.50 లక్షల కు వేలంపాటలో విక్రయించటం గమనార్హం.