వామ్మో ఇదేం స్కెచ్.. పోలీసులే షాక్?

praveen
ఇటీవలి కాలంలో దేశంలో ఎక్కడ చూసినా డ్రగ్స్ మత్తు యువత జీవితాన్ని మొత్తం నాశనం చేస్తుంది. డ్రగ్స్ కి బానిసగా మారిపోతున్నా యువత చివరికి నేరస్తులుగా మారుతున్న ఘటనలు కూడా వెలుగులోకి వస్తున్నాయి. ఈ మత్తు యువతను రక్షించేందుకు  కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకుంటూ ఉన్నాయి. అయినప్పటికీ ఇక అటు డ్రగ్స్ అక్రమ రవాణా చేస్తున్న వారు ఏదో ఒక విధంగా కొత్త దారులను వెతుకుతూ పోలీసులకు షాకిస్తున్న ఘటనలు తెరమీదికి వస్తూ ఉన్నాయి.


 అప్పటికే అక్రమార్కులు పోలీసులకు చిక్కకుండా ఏవేవో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఇక అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమా చూసిన తర్వాత మరింత కొత్తగా ఆలోచిస్తూ ఇక డ్రగ్స్ దందా నడిపిస్తున్నారు అన్న విషయం తెలిసిందే. అయినప్పటికీ పోలీసులకు చిక్కి చివరికి కటకటాలపాలవుతూ ఉన్నారు. ఇక ఇటీవల 250 కిలోల గంజాయిని పట్టుకున్నారు పోలీసులు. ఈ ఘటన ఖమ్మం జిల్లాలో వెలుగులోకి వచ్చింది. గుట్టు చప్పుడు కాకుండా ఒడిషా నుంచి రాజస్థాన్కు తరలిస్తున్న గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అంతేకాదు ఈ గంజాయిని అక్రమంగా రవాణా చేసేందుకు ఉపయోగించిన రెండు ట్రాక్టర్లను ఒక లారీని కూడా స్వాధీనం చేసుకోవడం గమనార్హం.


 ఇటీవలే పోలీసులు అదుపులోకి తీసుకున్న నిందితుల్లో ముగ్గురు రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన వారని పోలీసులు చెప్పుకొచ్చారు. ఇక ఇలా గంజాయి అక్రమ రవాణాకు స్మగ్లర్లు ఆలోచించిన విధానం మాత్రం పోలీసులను షాక్ కి గురి చేసింది. అచ్చంగా పుష్ప సినిమాలో లాగానే ట్రాక్టర్ కింద భాగంలో 6 అరలు ఏర్పాటు చేయించారు. ఖమ్మం బుర్హన్పురం లో రాజస్థాన్ కు చెందిన లారీలో గంజాయి ఎక్కిస్తుండగా  పోలీసులు పట్టుకున్నారు. గంజాయి విలువ సుమారు 75 లక్షల వరకు ఉంటుందని చెబుతున్నారు. ట్రాక్టర్ ట్రాలీ కింద కూడా  గంజాయిని ఉంచినట్లు  తెలుస్తోంది. ట్రాలి లేపితే గాని గంజాయి ఉన్నట్లు తెలియకుండా కవర్ చేశారని పోలీసులు అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: