ఏడేళ్ల చిన్నారి మృతి.. అంత్యక్రియలు చేస్తుంటే అక్కడ రక్తం.. చివరికి?

praveen
ఆ తల్లిదండ్రులు కూతురు పుట్టింది అని ఎంతో సంతోష పడి పోయారు. ఇక మహాలక్ష్మీ మా ఇంటికి వచ్చింది అని సంబర పడిపోయారు. కూతురికి ఏ కష్టం రాకుండా అల్లారుముద్దుగా పెంచుకున్నారు. అయితే ఇటీవల ఎం జరిగిందో తెలియదు గానీ బయటికి వెళ్లి ఇంటికి తిరిగివచ్చిన తల్లిదండ్రులకు మంచంపై విగతజీవిగా పడుకున్న కూతురు కనిపించింది. అయితే అనారోగ్యం కారణంగానే తమ కూతురు మరణించింది అని అనుకున్నారు ఆ తల్లిదండ్రులు. కొండంత బాధతో నిండి పోయిన హృదయాలతో ఇక తమ చిన్నారి కూతురు కి అంత్యక్రియలకు అన్ని ఏర్పాట్లు చేశారు


 ఇలా అంత్యక్రియలు నిర్వహిస్తూ ఉండగా ఆ చిన్నారి బట్టలపై రక్తపు మరకలు కనిపించాయి. దీంతో ఒక్కసారిగా అప్రమత్తమయ్యారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ఈ ఘటనపై కేసు చేసుకున్న పోలీసులు ఇక మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిర్వహించారు. ఇక అంతలోనే సంచలన నిజం బయటపడింది. బాలికపై అత్యాచారం చేసి గొంతు నులిమి హత్య చేశారు అన్న విషయం పోస్టుమార్టం రిపోర్టులో తేలింది. ఇక ఈ ఘటనతో తల్లిదండ్రుల గుండె మరింత పగిలి పోయింది అని చెప్పాలి. ఈ ఘటన రాజస్థాన్ లో వెలుగులోకి వచ్చింది. బార్మర్ జిల్లాకు చెందిన ఏళ్ల బాలిక తల్లిదండ్రులతో కలిసి బంధువుల ఇంటికి వెళ్ళింది.


 అయితే చిన్నారిని ఇంట్లో నిద్రబుచ్చి ఇక తల్లిదండ్రులు బయటికి వెళ్లారు. ఇక అదే సమయంలో వరుసకు బంధువైన 35 ఏళ్ల వ్యక్తి నిద్రపోతున్న బాలికను నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి దారుణంగా అత్యాచారానికి పాల్పడ్డాడు. ఇక  రక్తస్రావం కావడంతో ఎవరికైనా విషయం తెలిస్తే శిక్ష పడుతుందని భయపడి చివరికి గొంతు నులిమి హత్య చేశాడు. ఇంటికి తీసుకువెళ్లి ఇక నిద్ర పోతున్నట్లు గా మంచం మీద పడుకో పెట్టాడు. తర్వాత రోజు ఉదయం తల్లిదండ్రులు వచ్చి లేపిన చిన్నారి లేవలేదు. అనారోగ్యంతో చిన్నారి చనిపోయిందని బాధాతప్త హృదయాలతో అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు. కానీ అంతలోనే చిన్నారి ప్యాంట్ వద్ద  రక్తపు మరకలు కనిపించాయి. ఇక ఆ తర్వాత పోస్టుమార్టం రిపోర్ట్ లో అత్యాచారం జరిగినట్లు తేలింది. పోలీసు విచారణలో 35 ఏళ్ల బంధువు నిందితుడు అని తేలింది. అతనికి జీవిత ఖైదు విధించింది కోర్టు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: