ఇదెక్కడి విడ్డూరం.. బొట్టు పెట్టుకుందని.. విద్యార్థిని కొట్టిన టీచర్?

praveen
మన దేశంలో గురువును దైవంగా భావిస్తారు. ఎందుకంటే జన్మనిచ్చేది తల్లిదండ్రులు అయినా సరే ఇక జన్మకి అసలైన రూపాన్ని ఇచ్చేది మాత్రం గురువులే అని చెబుతూ ఉంటారు. ఎందుకంటే ఒక వ్యక్తి ఎలా ఎదగాలి ఎలాంటి దారి లో వెళ్లాలి ఎదుటి వాళ్లకు ఎలా గౌరవించాలి అని.. ఇక నేటి సమాజం తీరు ఏంటి అని చెప్పేది విద్యాబుద్ధులు నేర్పేది గురువు మాత్రమే. అందుకే గురువుని దేవుడితో సమానంగా కొలుస్తూ వుంటారు. కానీ ఇటీవలి కాలంలో మాత్రం విద్యాబుద్ధులు చెప్పి విద్యార్థులను సన్మార్గంలో నడిపించాల్సిన సంఘటనలు వెలుగులోకి వస్తున్నాయి.


 తమ దగ్గర చదువుకున్న పిల్లలను సొంత బిడ్డల్లా చూసుకోవాల్సింది పోయి దారుణంగా వ్యవహరిస్తున్నారు ఎంతోమంది. ఇలా కొంత మంది ఉపాధ్యాయులు చేస్తున్న పని ఏకంగా మొత్తం టీచర్ వృత్తికే కళంకం తెచ్చే విధంగా ఉంది అని చెప్పాలి. అయితే కులమతాలతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరినీ సమానంగా చూడాలనే నైతికతను విద్యార్థులకు నేర్పించాలి ఉపాధ్యాయులు. కానీ ఇక్కడ ఒక టీచర్ మాత్రం ఇలాంటివి  విద్యార్థులకు నేర్పించడం కాదు తానే మరిచిపోయాడు. ఒక విద్యార్థిని చిన్న కారణాలకే దారుణంగా కొట్టాడు.


 జమ్మూ కాశ్మీర్లోని రాజౌరీ జిల్లాలో ఓ ప్రభుత్వ పాఠశాలలో  నిస్సార్ అహ్మద్ అనే వ్యక్తి ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నాడు. అయితే ఇటీవలే ఓ హిందూ విద్యార్థిని నుదుట తిలకం పెట్టుకుని పాఠశాలకు సంతోషంగా వచ్చింది. ఇక విద్యార్థిని నుదుట తిలకం గమనించిన టీచర్ కోపంతో ఊగిపోయాడు. అసభ్యకర పదజాలంతో బాలికను తీవ్రంగా దూషించడమే కర్రతో దారుణంగా కొట్టాడు. ఈ దృశ్యాలు మొత్తం కొంతమంది వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయడం తో వైరల్ గా మారిపోయింది. ఈ ఘటనపై రాజౌరీ జిల్లా విద్యాశాఖ డిప్యూటీ కమిషనర్ స్పందించాడు. వెంటనే సదరు టీచర్ ను సస్పెండ్ చేశాడు. తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: