చేసేది ఐటి ఉద్యోగం.. మంచి జీతం.. కానీ ఈ పాడు పనేంటో?

praveen
ఇటీవలి కాలంలో ఎంతో మంది బాగా చదివి మంచి ఉద్యోగం సాధించాలి అని అనుకుంటున్నారు. ఈ క్రమంలోనే  ఐటీ ఉద్యోగం అయితే ఇక అటు వేతనాలు కూడా ఎక్కువగా ఉంటాయని లైఫ్ ని ఎంతో బాగా లీడ్ చేయవచ్చు అని అనుకుంటున్నారు. కానీ నేటి రోజుల్లో ఆధునిక జీవన శైలికి జల్సాలకు అలవాటుపడి పోతున్న ఎంతో మంది యువత ఐటీ ఉద్యోగం చేస్తూ వచ్చిన జీతంతో సరిపెట్టుకోకుండా ఇక చెడు దారిలో వెళ్తున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. ఇలా ఇటీవలి కాలంలో ఎంతో మంది మాకు సాఫ్ట్వేర్ ఉద్యోగాలు రావడం లేదని బాధపడుతూ ఉంటే... మరి కొంత మంది మాత్రం సాఫ్ట్వేర్ ఉద్యోగంలో కొనసాగుతూ భారీగా వేతనం వచ్చిన చివరికి నేరాలకు పాల్పడుతున్నారు.


 మరీ ముఖ్యంగా యువకులు ఐటీ నిపుణులు గంజాయి కు ఉన్న డిమాండ్ను సొమ్ము చేసుకునేందుకు ఎంతోమంది ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే అరకు నుంచి తీసుకువచ్చి మల్కాజిగిరి మేడ్చల్ పంజాగుట్ట బంజారాహిల్స్ లలో కొంతమంది గంజాయి విక్రయిస్తున్నట్లు తెలియడంతో పోలీసులు నిఘా పెంచారు. దీంతో ఒక ఐ.టి ఉద్యోగిని బండారం బయటపడింది. కొండపనేని మాన్సీ అనే యువతి నాచారం లో ఉన్న ఒక ఐటీ కంపెనీలో పని చేస్తుంది. ఇక సాఫీగా ఉద్యోగం చేసుకోకుండా గంజాయి విక్రయించడానికి సిద్ధమైపోయింది సదరు యువతి.


 ఇక తన భర్త మదన్ తో కలిసి రెండేళ్లుగా గంజాయి విక్రయించడం ప్రారంభించింది. ఈ క్రమంలోనే ఇక ఈ విషయంపై సమాచారం అందుకున్న పోలీసులు నిఘా పెట్టారు. ఇటీవలే మార్చి 12వ తేదీన దంపతులు మరో ఇద్దరు యువకులతో కలిసి గంజాయి అమ్ముతూ ఉండగా ఇక బోయిన్పల్లి పోలీసులు అరెస్టు చేయడానికి వెళ్లారు. అయితే 1.2 కిలోల గంజాయి తో ఇక యువకులు ఇద్దరు పోలీసులకు చిక్కగా దంపతులు మాత్రం అక్కడి నుంచి పరారయ్యారు. పోలీసులకు చిక్కిన యువకులు ఇచ్చిన సమాచారంతో మాన్సీ నీ పట్టుకున్నారు పోలీసులు.  ఇంజనీరింగ్ పూర్తి చేసిన ఆమె ఉద్యోగం చేసేందుకు హైదరాబాద్ వచ్చింది. చివరికి ఇక గంజాయి డిమాండ్ క్యాష్ చేసుకునేందుకు నేరాలకు పాల్పడినట్లు పోలీసుల విచారణలో తేలింది..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: