వరుసకు బావ అయ్యే యువకునితో ప్రేమ.. చివరికి?
పొన్నాడ కేజీబీవీ లో ఇంటర్ రెండో సంవత్సరం చదువుతున్న బాలిక గర్భం దాల్చిన విషయాన్నీ పాఠశాల యాజమాన్యం గోప్యంగా ఉంచింది. అయితే ప్రిన్సిపల్ శిరీషకు పడనివారు విద్యార్థి సంఘాల సమాఖ్య రాష్ట్ర స్థాయి అధికారులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఈ క్రమంలోనే పాఠశాల ప్రిన్సిపాల్ ను విధుల నుంచి తొలగిస్తూ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఇటీవలి కాలంలో కరోనా వైరస్ సెలవుల్లో భాగంగా విద్యార్థులు ఇంటికి వెళ్లడంతో అటు శ్రీకాకుళం ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణలో నిర్వహించిన క్రీడాపోటీల్లో పాల్గొంది బాలిక.
ఈక్రమంలోనే వరసకు బావ అయ్యే ఒక వ్యక్తి పరిచయమయ్యాడు. ఇక ప్రేమ పేరుతో వెంటపడి పెళ్లి పేరుతో లైంగిక దాడికి పాల్పడ్డాడు సదరు యువకుడు. యువతిపై లైంగిక దాడిని రహస్యంగా ఉంచిన చివరికి అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఈ విషయం కాస్త పాఠశాల వర్గాల్లో చర్చనీయాంశంగా మారిపోయింది. పాఠశాల వసతి గృహంలో వాంతులు చేసుకోగా.. సిబ్బంది గమనించి ఆసుపత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు గర్భవతిగా నిర్ధారించారు. అయితే ఈ విషయంపై తమ వద్దకు ఇప్పటివరకు ఎలాంటి ఫిర్యాదు రాలేదని పోలీసులు చెబుతున్నారు..