బీహార్ లో గ్యాంగ్ ఎటాక్.. వైరల్ వీడియో?
ఈ ఘటన బీహార్లో వెలుగులోకి వచ్చిందిm బీహార్లోని దర్భాంగా లో ఘనశ్యాం పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న గ్రామంలో జ్వాలాముఖి కిరాణా షాపు ఉంది. ఇక ఈ కిరాణా షాపులో ఇటీవలే చోరీ జరిగింది. సాయంత్రం సమయంలో ఒక్కసారిగా ఐదుగురు గుర్తు తెలియని వ్యక్తులు షాప్ లోకి వచ్చారు. ముఖాలకు మాస్క్లు ధరించి ఉన్నారు. ఇక చేతుల్లో కత్తులు ఇనుప రాడ్లు లాంటి మారణాయుధాలు కూడా పట్టుకుని వచ్చారు. అయితే ఇలా షాప్ లోకి చొరబడిన దొంగలు ముందుగా కౌంటర్లో ఉన్న డబ్బంతా ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు.
కానీ అటు షాపు యజమాని మాత్రం దొంగలకు డబ్బు అప్ప చెప్పేందుకు అస్సలు అంగీకరించలేదు. ఇక ఆ దొంగలను అడ్డుకునేందుకు శాయశక్తులా ప్రయత్నించారు. అయితే ఇక ఒంటరివాడు కావడంతో దొంగలు అతడ్ని చితకబాదారు. క్యాష్ లాకర్ లో డబ్బులు ఉండడంతో పూర్తిగా అన్ని ఖాళీ చేశారు. ఇక ఆ దొంగల దగ్గర నుంచి మళ్లీ డబ్బులు తీసుకోవాలని షాపు యజమాని ఎంత ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. ఇలా ఆ దొంగల ముఠా షాపులోకి రావడం ఇక ఆ తర్వాత యజమానిపై దాడి చేయడం పూర్తిగా కెమెరాల్లో రికార్డు అయింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.