భార్య చెల్లెలిపై కన్ను.. చివరికి ఓ రోజు?

praveen
నేటి రోజుల్లో వావి వరుసలు మరచి పోతున్న మనుషులు అడవి లో ఉండే మృగాల కంటే దారుణం గా వ్యవహరిస్తున్న ఘటనలు సభ్య సమాజాన్ని తలదించుకునేలా చేస్తూ ఉన్నాయి.  సొంత వారి విషయం లోనే కామం తో ఊగిపోతూ దారుణం గా వ్యవహరిస్తూ ఉన్నారు. చివరికి ఇక వేధింపులు తాళలేక పోతున్న ఎంతో మంది మహిళలు మనస్తాపం తో ఆత్మహత్య చేసుకున్న ఘటనలు కూడా తెలుగులోకి వస్తున్నాయ్. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన జరిగింది. ఓ వ్యక్తి భార్య చెల్లి పై కన్నేశాడు. తరచు కోరిక తీర్చాలి అంటు వేధింపులకు పాల్పడుతూ ఉండేవాడు.


 రోజు రోజుకు వేధింపులు ఎక్కువవడం తో తాళ లేక పోయినా సదరు యువతి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. పెద్ద దిక్కు లేని అత్తారింట్లో బాగోగులు చూసుకోవాల్సిన అల్లుడు చివరికి మరదలి పై కన్నేశాడు. చివరికి ఆమె జీవితాన్ని బలి తీసుకున్నాడు. ఈ ఘటన ఖమ్మం జిల్లా ఏన్కూరు మండలం భగవాన్ నాయక్ తండా లో చోటు చేసుకుంది. గుగులోతు శ్రీను చిన్ని దంపతులకు ఐదుగురు కుమార్తెలు ఉన్నారు. శ్రీను కొన్నేళ్ల క్రితం మృతి చెందడం తో కుటుంబ భారం చిన్ని పై పడింది. ఇక తండాలో వ్యవసాయం చేసుకుంటూ కుమార్తెలకు పెళ్లిళ్లు చేస్తూ వస్తోంది సదరు మహిళ. ఇప్పటివరకు నలుగురికి వివాహం చేసింది.



 అయితే చిన్ని మూడో అల్లుడు ఖమ్మం కి చెందిన సంతోష్ కొన్నాళ్లు గా చిన్ని చిన్న కూతురు ప్రమీలను  పెళ్లి చేసుకోవాలంటూ బెదిరించడం మొదలు పెట్టాడు. అంతేకాకుండా అసభ్యం గా ప్రవర్తిస్తూ ఉన్నాడు. ఈక్రమంలోనే రోజురోజుకు వేధింపులు ఎక్కువవడంతో భరించలేకపోయింది ప్రమీల. దీంతో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. వెంటనే కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: