షాకింగ్ : వాకింగ్ వెళ్తే ప్రాణం పోయింది?
ఇక ఇలాంటి ఘటనలు చూసిన తర్వాత అటు మనిషి జీవితం దేవుడి చేతిలో కీలుబొమ్మ లాంటిది అని అనిపిస్తూ ఉంటుంది ప్రతి ఒక్కరికి. ఎందుకంటే అంతా సాఫీగా సాగిపోతుంది అనుకుంటున్న సమయంలో అనుకోని ఘటనలు చివరికి విషాదాన్ని నింపుతూ ఉంటాయి. అతను రోజు లాగానే వాకింగ్ కు వెళుతూ ఉన్నాడు కానీ ఊహించని ఘటన. అటువైపుగా వేగంగా వచ్చిన ఒక బైక్ అతని ఢీకొట్టింది. దీంతో ఒక్కసారిగా ఎగిరి పడ్డాడు సదరు యువకుడు. తీవ్రగాయాలు అయ్యాయి. ఇక వెంటనే ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ యువకుడు మృతి చెందాడు. ఈ విషాదకర ఘటన మెదక్ జిల్లా చిన్న శంకరంపేట్ లో చోటుచేసుకుంది.
యాదగిరి అనే 34 ఏళ్ల వ్యక్తి ఉదయం సమయంలో స్నేహితులతో కలిసి వాకింగ్ చేయడానికి వెళ్ళాడు. కానీ అక్కడే ఒక వాహనం రూపంలో మృత్యువు తన కోసం వేచి చూస్తోంది అన్న విషయాన్ని మాత్రం గ్రహించలేక పోయాడు. ఇలా రోడ్డుపై వాకింగ్ చేస్తున్న సమయంలో అటువైపుగా వేగంగా దూసుకొచ్చిన శ్రీ ద్విచక్ర వాహనం అతన్ని ఢీకొట్టింది. అయితే ఇక ఈ ఘటనలో తీవ్ర గాయాలపాలై అతన్ని స్థానిక ఆసుపత్రికి తరలించగా చికిత్స చేసిన వైద్యుల సూచనల మేరకు హైదరాబాద్ ఆస్పత్రికి తరలించారు. ఈ క్రమంలోనే చికిత్స పొందుతూ మృతి చెందాడు యాదగిరి. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతునికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు..