దారుణం : బిడ్డను సజీవంగా భూమిలో పాతిపెట్టిన తల్లి?
రక్తం పంచుకుని పుట్టిన బిడ్డ విషయంలోనే చివరికి మానవ మృగాలుగా మారిపోయి దారుణంగా ప్రాణాలు తీసేస్తూ ఉన్నారు. ముఖ్యంగా అభం శుభం తెలియని చిన్నారులను దారుణంగా తల్లులే ప్రాణాలు తీస్తున్న ఘటనలు సభ్యసమాజాన్ని తలదించుకునేలా చేస్తున్నాయి అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.. ఇక్కడ అమ్మతనానికి అవమానం మానవత్వానికి మచ్చ తెచ్చే సంఘటన ఒకటి జరిగింది. ఏకంగా కన్నతల్లే పసిబిడ్డను సజీవంగా భూమిలో పాతిపెట్టింది. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్ లో వెలుగులోకి వచ్చింది.
బస్తీలోని జిల్లా ఆసుపత్రి పక్కనే ఈ ఘటన చోటు చేసుకోవడం గమనార్హం. జిల్లా ఆస్పత్రి సమీపంలో ఓ మహిళకు చిన్నారి ఏడుపు వినిపించింది. ఈ క్రమంలోనే గమనించిన మహిళ అటువైపుగా వెళ్లి చూసింది. ఈ క్రమంలోనే అక్కడ భూమిలో సగం పాతిపెట్టిన శిశువు కనిపించింది. దీంతో ఒక్కసారిగా షాక్ అయింది సదరు మహిళ. వెంటనే పోలీసులకు సమాచారం అందించింది. ఈ క్రమంలోనే అక్కడికి చేరుకున్న పోలీసులు బిడ్డను బయటకు తీశారు. ఆసుపత్రిలో పిల్లల వార్డు కు తరలించి చికిత్స అందించారు. పాప ఆరోగ్యంగా ఉందని తెలిపారు. ఇక చిన్నారి తల్లి కోసం గాలింపు చర్యలు చేపట్టారు పోలీసులు.