దొంగలకు ఇలాంటి కంపెనీ కూడా ఉందా?

Satvika
దొంగతనాలు చెసెందుకు దొంగలు అవసరాలకు తగ్గట్లు  మాటు వేసి దొంగతనాలు చేస్తారు. అది ఇప్పటివరకు స్వతహాగా చేసుకున్నారు. కానీ ఇప్పుడు దొంగలకు ఒక కంపెనీ ఉందట.. ఇదెంది అదేమైనా సాఫ్ట్ వెర్ ఉద్యొగమా అని అందరూ అనుకుంటారు కదా.. అంతేకాదు మరో విషయం ప్రభుత్వ ఉద్యోగులకు లేని సదుపాయాలు కూడా ఉన్నాయి. దొంగతనం బట్టి సాలరీ, బోనస్ లు పండగలు, పబ్బాలు వస్తే ప్రత్యేక గిఫ్ట్ లు కూడా ఇస్తారట.. వామ్మో ఇది నిజంగా ఉందా.. అవును ఉందని అంటున్నారు.అది ఎక్కడో ఇప్పుడు ఒకసారి వివరంగా తెలుసుకుందాం.


జైపూర్ ఈ కంపెనీ ఉందట.. వీళ్ళు ఎక్కువగా వాహనాలను టార్గెట్ చెస్తారట..వాహనాలను దొంగిలించడం, వాటిని విడదీయడం, ఆ విడిభాగాలను బయట విక్రయించడం, మిగిలిపోయిన వస్తువులను డంపింగ్ చేయడం చేస్తారు. నిత్యం ఎన్నో వాహానాలు ఇలా మిస్ అవుతూన్నాయని ప్రజలు పోలీసులను ఆశ్రయించారు.. దీని పై స్పెషల్ ఫోకస్ పెట్టిన పోలీసులు నిఘాను పెంచారు. దాంతో దొంగల ముఠాను పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు.. ఇది విన్న వారంథా కూడా ఖంగు తిన్నారు.


ప్రత్యేక నెలవారీ ప్యాకేజీను ఉద్యోగుల కు ఇస్తున్నాడు ఓ ఘనుడు. చివరికి జైపూర్‌ పోలీస్ స్టేషన్ 10 మంది దుండగులను పట్టుకోవడంతో ఆ ముఠా అసలు బండారం బయటపడింది. వారి దగ్గర నుంచి వందల వాహనాల ను కూడా స్వాదీనం చేసుకున్నారు.. నిరుద్యోగులకు డబ్బు ఎర చూపి వారి ఆర్థిక పరిస్థితులను అవకాశంగా చేసుకుని దొంగతనాలకు ప్రేరేపించి వాళ్లను దొంగలుగా మారుస్తున్నాడు... అలా ఉద్యోగం లో చేరిన వారంతా కూడా -రిక్షాలు, బైక్‌లు మాయం చేస్తారు. ఆ తర్వాత వాటి ఇంజిన్ల ను తీసి టైర్లు, బ్యాటరీలు వీడిగా చేయడం తో వాటిని మార్కెట్ లో అమ్మడం చేస్తారు.. దొంగలకు నెలకు 30 వేలు కూడా ఇస్తున్నట్లు తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: