ఆ పనికి ఒప్పుకోలేదని.. నీచుడు ఏం చేసాడో తెలుసా?

praveen
మహిళల దినోత్సవం వచ్చిందంటే చాలు మహిళలు ఎంతో గొప్ప.. కుటుంబం కోసం జీవితాంతం కష్ట పడుతూ ఉంటారు. ఇక పిల్లల కోసం జీవితాన్ని త్యాగం చేస్తూ ఉంటారు అని ఎంతో గొప్పగా మాట్లాడుతూ ఉంటారు. కానీ  మహిళా దినోత్సవం రోజున కూడా మహిళలపైఅత్యాచారం జరుగుతున్న దుస్థితి నేటి రోజుల్లో ఏర్పడింది. ఇలా నేటి రోజుల్లో ఆడపిల్లలపై అత్యాచారం ఘటనలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి తప్ప ఎక్కడ తగ్గుముఖం పట్టడం లేదు. కనుచూపు మేరలో మహిళా కనిపించింది అంటే చాలు ప్రతి మగాడి లో మృగాడు బయటకు వస్తున్నాడు. మనిషిని అన్న విషయాన్ని మర్చిపోయి మానవ మృగం గా మారుతూ దారుణంగా అత్యాచారాలకు పాల్పడుతున్నారు.



 ఇలా ఎక్కడ చూసినా మహిళల రక్షణ ప్రశ్నార్థకంగా మారిపోయింది అన్న దానికి నిదర్శనంగా మారూతున్న ఘటనలు ఎన్నో వెలుగులోకి వస్తున్నాయి. ఆడది ఒంటరిగా కనిపిస్తే చాలు దారుణంగా వ్యవహరిస్తున్నారు. ఇటీవల ఏపీలో ఇలాంటి ఓ దారుణం ఘటన వెలుగులోకి వచ్చింది. గడ్డి కోసం పొలం వద్దకు వచ్చిన ఓ మహిళపై దుండగుడు లైంగిక దాడికి ప్రయత్నించాడు. దీంతో ఒక్కసారిగా షాక్ నుంచి తేరుకున్న మహిళ ప్రతిఘటించింది. దీంతో ఇక ఆమెను దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటన స్థానికంగా అందరినీ భయాందోళనకు గురి చేసింది.



 ఎర్ర వారి పాలెం మండలం నారాబైల్  పంచాయతీకి చెందిన మహిళ కు ఇద్దరు పిల్లలు ఉన్నాడు. అయితే భర్త జీవనోపాధి నిమిత్తం కువైట్ వెళ్ళాడు. ఈ క్రమంలోనే రెండు పాడి ఆవులను మేపుకుంటూ సదరు మహిళా జీవనం సాగిస్తోంది. ఇకపోతే ఇటీవల గడ్డి కోసం పొలం వద్దకు వెళ్లింది సదరు వివాహిత. ఇక అక్కడే కాపు కాచుకుని కూర్చున్న ఓ కామాంధుడు ఆమెపై లైంగికదాడి చేయడానికి ప్రయత్నించాడు. ఈ క్రమంలోనే ఒక్కసారిగా అప్రమత్తమైన సదరు మహిళ కామాంధుడి పై ప్రతిఘటించింది. దీంతో ఆమె గొంతు కోసి చంపేశాడు. అనంతరం మృతదేహాన్ని 100 మీటర్ల దూరంలో ఉన్న పాడుబడిన బావిలో పడేసాడు. స్థానికులు పోలీసులకు చెప్పడంతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: