ప్రేయసిని ఇంప్రెస్ చేసేందుకు.. విద్యార్థులు ఎంతకు తెగించారో తెలుసా?
ఉత్తరప్రదేశ్లోని గోండా జిల్లా గద్వాల ప్రాంతం లో ప్రేమలో పడిన ఐదుగురు ఇంజనీరింగ్ విద్యార్థులు చదువుని పూర్తిగా వదిలేశారు. అంతే కాదు మంచి చెడు అనే విచక్షణ కూడా కోల్పోయి ప్రవర్తించడం మొదలు పెట్టారు. అయితే ప్రతిరోజు మిగతా విద్యార్థుల లాగానే అయిదు గురు కూడా కాలేజీ కి వెళ్తున్నారు. ఇక తాము ప్రేమించిన యువతులను ఇంప్రెస్ చేయడానికి వారి కోరికలు తీర్చడానికి ఇంట్లో ఇచ్చిన పాకెట్ మనీ సరిపోకపోవడంతో దొంగలుగా అవతారమెత్తారు. చివరికి ప్రేమ కోసం నేరాలకు పాల్పడి భవిష్యత్తును నాశనం చేసుకున్నారు.
ఇక దొంగలుగా మారిన ఐదుగురు ఇంజనీరింగ్ విద్యార్థులు ఏకంగా చుట్టుపక్కల ప్రాంతాల్లో మొబైల్ దోపిడీలు చైన్ స్నాచింగ్ లు బైక్ దొంగతనాలకు పాల్పడుతూ వాటిని అమ్ముతూ వచ్చిన డబ్బులతో జల్సాలు చేయడం మొదలుపెట్టారు. ఇటీవలి కాలంలో దోపిడీల ఫిర్యాదులు ఎక్కువగా రావడంతో ఇక ఈ విషయంపై పోలీసులు సీరియస్గా దృష్టి పెట్టారు. ఈ క్రమంలోనే చోరీకి పాల్పడుతున్న యువకుడిని అరెస్టు చేసిన పోలీసులు తమదైన శైలిలో విచారించడంతో మరో నలుగురు పేర్లు కూడా బయటకు వచ్చాయి. దీంతో వారి దగ్గర నుంచి 9 మొబైల్స్ రెండు బైకులు స్వాధీనం చేసుకున్నారు..