ఓ దేవుడా నీకు దయ లేదా.. ఒకే ఘటనలో నలుగురు మృతి?

praveen
కరోనా వైరస్ కాలం లో మనిషి ప్రాణాలకు అసలు గ్యారెంటీ లేకుండా పోయింది.  కనిపించని శత్రువైన కరోనా వైరస్ ఏ క్షణం లో  దాడి చేసి ప్రాణాలు తీస్తుందో అని ప్రతి ఒక్కరు భయపడుతూనే బ్రతుకుతున్నారు. ఇలాంటి సమయం లో అటు రోడ్డు ప్రమాదాలు కూడా ఎంతో మంది ప్రాణాలను గాల్లో కలిపేస్తున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. రోడ్డు నిబంధనలు  పాటించకపోవడం అతివేగం వెరసి ఎన్నో ప్రమాదాల్లో ఎంతోమంది ప్రాణాలు కోల్పోతూ ఉండడంతో ఎన్నో కుటుంబాలు శోకసముద్రం లో మునిగి పోతు ఉన్నాయి. ఇక ఇటీవలే మూలుగు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.



 ములుగు జిల్లా ఎర్రి గట్టమ్మ వద్ద జాతీయ రహ దారిపై ఒక ఆటోను వేగం గా దూసుకు వచ్చిన డీసీఎం వ్యాన్ ఢీకొట్టింది. ఇక ఈ ఘటన లో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు కూడా అక్కడికక్కడే మృతి చెందారు. ఇక మరో నలుగురు తీవ్రం గా గాయ  పడ్డారు అన్నది తెలుస్తుంది. అయితే ఈ ప్రమాదం ధాటికి ఆటో నుజ్జునుజ్జు అయింది. మృత దేహాలు చెల్లా చెదురుగా రోడ్డుపై పడి పోయి ఉన్నాయి. ఇక మృతుల్లో ఇద్దరు చిన్నారులు ఒక మహిళ ఆటో డ్రైవర్ కూడా ఉన్నారు అన్నది తెలుస్తుంది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు.



 ఇక క్షతగాత్రులను వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు పోలీసులు. మృతులు మంగంపేట మండలం కోమటిపల్లి కి చెందిన అజయ్, కిరణ్, కౌశల్య, డ్రైవర్ జానీ ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఇక తీవ్రంగా గాయ పడిన వారిలో పల్లె బోయిన పద్మ, రసూల్, వెన్నెల, వసంత ఉన్నారని పోలీసులు తెలిపారు. అయితే వీరంతా అన్నారం షరీఫ్ దర్గా కు వెళ్లి వస్తున్న సమయం లో ఈ ప్రమాదం జరిగిందని తెలిపారు  పోలీసులు.  కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: