ప్రేమించుకున్న చాలా మంది ప్రేమికులు పెళ్ళి తో ఒకటవ్వలెదు. కానీ కొంతమంది ప్రేమను గెలిపించాలని ప్రెమించిన వ్యక్తిని ఎన్ని కష్టాలు వచ్చినా కూడా భయపడకుండా ముందుకు వస్తారు. పెళ్ళి చేసుకున్న వ్యక్థి చివరకు జీవచ్చవంలా పడి ఉన్న ఓ ఘటన ఇప్పుడు వెలుగులొకి వచ్చింది. కట్టుకున్న భర్త చనిపొయారు. అది పట్టించుకోవడం మానెసింది. భర్త చనిపోయి మూడు రోజులు అవుతూన్నా అలానే ఉంది. ఇంట్లో నుంచి దుర్వాసన రావడం గమించిన చుట్టూ పక్కల వాళ్ళు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
గ్రామస్తుల ఫిర్యాధు తో రంగంలోకి దిగిన పోలీసులు భర్త మృతదేహాన్ని పోస్ట్ మార్టమ్ కోసం ఆసుపత్రికి తరలించారు.. అనుమానాస్పద కేసు నమోదు చేసుకున్న పోలీసులు అన్నీ కొనాల్లొ దర్యాప్తు జరుగుతోంది. వివరాల్లొకి వెళితే.. ఈ ఘటన హుబ్లీ నవనగర ఎల్‌ఐజీ వద్ద చోటు చేసుకుంది. ధార్వాడ లోని ఎత్తినగుడ్డ నివాసి మంజునాథ అబ్బిగెరె తొమ్మిదేళ్ల క్రితం యువతిని ప్రేమ వివాహం చేసుకున్నాడు.. అప్పటి నుంచి ఏదోకటి తింటూ జీవితం సాగించారు.
వీరి కాపురానికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఎంతో సంతోషంగా ఉంటారని అక్కడి వాళ్ళు అంటున్నారు. అయితే రెండు రోజులు క్రితం ఇంటి నుంచి దుర్వాసన వస్తుండటం తో స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సమాచారం మేరకు అక్కడకు చేరుకున్న పోలీసులు పరిశీలించ గా మంజునాథ విగతజీవిగా కనిపించాడు. ఇతను మూడు రోజుల క్రితమే మృతి చెందాడని, ఇంట్లో భార్య, పిల్లలు ఉన్నా మృతి విషయాన్ని బయటకు చెప్పలేదని పోలీసులు నిర్ధారించారు. ఆ తర్వాత మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. మంజునాథ మృతిపై తమకు అనుమానం ఉందని మృతుడి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.. అసలు అతని మరణం వెనుక ఉన్న కారణాలు ఏమిటి అనే కోణం లో విచారణ చేపట్టారు.. వివరాలు తెలియాల్సి ఉన్నాయి.