బైక్ దొంగలించాడు అనే అనుమానం.. చివరికి ఏం చేశారంటే?

praveen
ఇటీవల కాలంలో ఎక్కడ చూసినా దొంగల బెడద ఎక్కువ అయిపోతుంది. ఈ క్రమంలోనే ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అయినప్పటికీ దొంగలు మాత్రం చేతివాటం చూపిస్తూ చోరీలు చేయడం చేస్తూ ఉన్నారు. అయితే నేటి రోజుల్లో ఎంతోమంది అమాయకులు దొంగతనం చేశారు అనే ఆరోపణలు ఎదుర్కొంటూ తీవ్ర అవమానాలకు గురవుతున్నారు అన్న విషయం తెలిసిందే. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన జరిగింది. బైక్ దొంగలించాడు అని ఆరోపిస్తూ ఏకంగా పది మంది యువకులు ఒక యువకుడిపై విచక్షణారహితంగా దాడి చేశారు.

 ఈ ఘటన తమిళనాడులోని కరూర్ లో వెలుగులోకి వచ్చింది.. వివరాల్లోకి వెళితే.. ప్రైవేట్ సంస్థలో పనిచేస్తూ ఉంటాడు 22ఏళ్ళ అనిష్  ఇకపోతే ఇటీవలే అతని దగ్గరికి ఇద్దరు వ్యక్తులు వచ్చారు. దొంగతనానికి గురైన ఒక ద్విచక్ర వాహనం గురించి అతని తో మాట్లాడాలి అంటూ చెప్పారు.. ఈ క్రమంలోనే అతని ఇద్దరు వ్యక్తులు కరూర్ జిల్లాలోని వీరరక్కయం లోని ఒక ప్రదేశానికి బలవంతంగా తీసుకు వెళ్లారు  అక్కడ ఉన్న మరో ఎనిమిది మంది వ్యక్తులతో కలిసి బైక్ దొంగ లించి ఏం చేసావో చెప్పు అంటూ దారుణంగా దాడి చేశారు ఇద్దరు వ్యక్తులు. బైక్ దొంగలించినట్లు ఒప్పుకోవాలి అంటూ అనిష్ప పై ఒత్తిడి కూడా చేశారు.

 ఎంతకు అనీష్ బైక్ దొంగలించినట్లు ఒప్పుకోకపోవడంతో చివరికి అతని ఇంటి దగ్గర విడిచిపెట్టి వెళ్లారు. అయితే విషయం తెలుసుకున్న అనిష్ తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే ఇక 10 మంది వ్యక్తులు అనీష్ పై దాడి చేసిన ఒక వీడియో సోషల్ మీడియాలో ప్రత్యక్షం కావడంతో వైరల్గా మారింది. పోలీసులు వరకు చేరింది. అయితే ఇందులో కర్రలు చెప్పులతో అనీష్ ని దారుణంగా కొట్టడమే కాదు ఇక కాళ్ళతో తన్నుతున్నట్లు కూడా ఉంది. ఈ క్రమంలోనే వీడియోలో ఉన్న వ్యక్తులను అరెస్టు చేసి కటకటాల వెనక్కి తోశారు పోలీసులు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: